సాక్షి, హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్‌పై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను ఈసీ హెచ్చరించింది. ఎన్నికల వేళ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించింది. ఆరోపణలు చేసే సమయంలో బాద్యతగా వ్యవహరించాలని, స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా మరింత బాధ్యతగా ఉండాలని హితవు పలికింది.
కాగా ఈనెల ఒకటవ తేదీన వరంగల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ విమర్శలు గుప్పించారు. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో ఎంతోమంది హీరోయిన్లను బ్లాక్ మెయిల్ చేశారని, అధికారులను బదిలీ చేశారని, అనేకమందిని ఉద్యోగాలు కోల్పోయి జైలుకు వెళ్లేలా చేశారన్నారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఈసీకి ఫిర్యాదు చేసిన క్రమంలో నేడు మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టింది ఎన్నికల సంఘం.
చదవండి: చూస్తూ ఊరుకోం.. యుద్ధం చేస్తాం: కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment