జర్నలిస్టులకు అక్షరం విలువ తెలియదు | Anantkumar Hegde's remarks against journalists draw flak | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులకు అక్షరం విలువ తెలియదు

Published Tue, Sep 12 2017 1:48 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

పాత్రికేయులకు అక్షరం విలువ తెలియదంటూ కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే సోమవారం అనుచిత వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర మంత్రి హెగ్డే
సాక్షి, బెంగళూరు: పాత్రికేయులకు అక్షరం విలువ తెలియదంటూ కేంద్ర మంత్రి అనంతకుమార్‌ హెగ్డే సోమవారం అనుచిత వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో హెగ్డే మాట్లాడుతూ ప్రస్తుతం పాత్రికేయ రంగంలో అంతా హడావిడి మనుషులే ఉన్నారన్నారు. ఏ ప్రశ్నలు అడగాలో, ఏం రాయాలో కూడా జర్నలిస్టులకు తెలియదనీ, అయితే ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని పాత్రికేయులు మాత్రం అలాంటి వారు కాదని మంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు హెగ్డే వ్యాఖ్యలపై జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నలు అడగడం, నిజాలను ప్రజలకు తెలియజేయడం తమ వృత్తి అనీ, కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని పలువురు మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement