ప్రముఖ రేడియో ప్రెజెంటర్‌ అమీన్‌ సయానీ కన్నుమూత | Ameen Sayani Iconic Radio Presenter And Voice Of Geetmala Dies | Sakshi
Sakshi News home page

ప్రముఖ రేడియో ప్రెజెంటర్‌ అమీన్‌ సయానీ కన్నుమూత

Published Wed, Feb 21 2024 11:39 AM | Last Updated on Wed, Feb 21 2024 12:09 PM

Ameen Sayani Iconic Radio Presenter And Voice Of Geetmala Dies - Sakshi

ప్రముఖ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ  మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. పాపులర్‌ 'బినాకా గీత్ మాలా' కార్యక్రమం వెనుక ఉండే వాయిస్‌ ఆయనేదే. ఈ కార్యక్రమం ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. ఆయనకు ప్రస్తుతం 90 ఏళ్ల వయసు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో  హుటాహుటినా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన కుమారుడు రాజిల్‌ సయానీ తెలిపారు.

రాత్రి ఏడు గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు చెప్పారు. ఆయన రేడియోలో తనను తాను 'నమస్కార్ భాయి యోం ఔర్ బెహ్నో, మై ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూన్' అనే డైలాగ్‌తో పరిచయం చేసుకునేవారు. ఇదే ఆయన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడమే గాక మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన డిసెంబర్ 21, 1932న ముంబైలో సాహితివేత్తల కుటుంబంలో జన్మించారు.

కాగా, ఆయన మృతి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రముఖ టెలివిజన్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయి అమీన్‌ సయానీని ఉద్దేశించి ఓ లెజెండర్‌ గాత్రం మన నుంచి దూరమయ్యింది. ఆయన 'బినాకా గీత్ మాలా', బోర్న్‌ విటా క్విజ్‌ వంటి కార్యక్రమాల్లో తన గాత్రంతో ప్రేకక్షులకు అలరించారు. అంతేగాక 50 వేలకు పైగా రేడియో షోలు చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన గొప్ప వ్యక్తి కనుమరుగవ్వడం బాధకరమైన విషయమంటూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 

(చదవండి: ప్యాంక్రియాటిక్ కేన్సర్‌ వల్ల గుండె ఆగిపోతుందా? నటుడు రితురాజ్‌ మృతికి ఇదే కారణమా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement