radio active
-
ప్రముఖ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ కన్నుమూత
ప్రముఖ రేడియో ప్రెజెంటర్ అమీన్ సయానీ మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. పాపులర్ 'బినాకా గీత్ మాలా' కార్యక్రమం వెనుక ఉండే వాయిస్ ఆయనేదే. ఈ కార్యక్రమం ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టింది. ఆయనకు ప్రస్తుతం 90 ఏళ్ల వయసు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించినట్లు ఆయన కుమారుడు రాజిల్ సయానీ తెలిపారు. రాత్రి ఏడు గంటల సమయంలో తుది శ్వాస విడిచినట్లు చెప్పారు. ఆయన రేడియోలో తనను తాను 'నమస్కార్ భాయి యోం ఔర్ బెహ్నో, మై ఆప్కా దోస్త్ అమీన్ సయానీ బోల్ రహా హూన్' అనే డైలాగ్‌తో పరిచయం చేసుకునేవారు. ఇదే ఆయన్ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడమే గాక మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన డిసెంబర్ 21, 1932న ముంబైలో సాహితివేత్తల కుటుంబంలో జన్మించారు. కాగా, ఆయన మృతి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రముఖ టెలివిజన్ రాజ్‌దీప్ సర్దేశాయి అమీన్ సయానీని ఉద్దేశించి ఓ లెజెండర్ గాత్రం మన నుంచి దూరమయ్యింది. ఆయన 'బినాకా గీత్ మాలా', బోర్న్ విటా క్విజ్ వంటి కార్యక్రమాల్లో తన గాత్రంతో ప్రేకక్షులకు అలరించారు. అంతేగాక 50 వేలకు పైగా రేడియో షోలు చేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన గొప్ప వ్యక్తి కనుమరుగవ్వడం బాధకరమైన విషయమంటూ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. More sad news: A legend.. the melodious voice of radio, of Binaca Geetmala.. of Bournvita Quiz contest on radio and so much more.. Behno aur Bhaiyo.. the genius that was Ameen Sayani with more than 50,000 radio shows is no more.. RIP, Om Shanti 🙏🙏 pic.twitter.com/ufMQ586u6M — Rajdeep Sardesai (@sardesairajdeep) February 21, 2024 (చదవండి: ప్యాంక్రియాటిక్ కేన్సర్ వల్ల గుండె ఆగిపోతుందా? నటుడు రితురాజ్ మృతికి ఇదే కారణమా?) -
వేలడంత లేదు.. వణికిపోతున్న పశ్చిమ ఆస్ట్రేలియా
కాన్బెర్రా: ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఏ క్షణాన ఏం జరుగుతుందో.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని ప్రజలు వణికిపోతున్నారు. వేలు సైజులో కూడా లేని ఓ క్యాప్సూల్ కోసమే ఇదంతా. కనిపిస్తే విపత్తుల నిర్వహణ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని ఎమర్జెన్సీ నెంబర్లను ప్రకటించారు. ఎందుకంటే ఆ క్యాప్సూల్ మామూలుది కాదు.. రేడియోయాక్టివ్తో కూడుకున్నది కావడమే ఇందుకు కారణం. ఎనిమిది మిల్లీమీటర్ల పొడవు, ఆరు మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న ఓ చిన్న రేడియోయాక్టివ్ క్యాప్సూల్ అది. కిబంర్లీ రీజియన్‌లోని న్యూమన్ నుంచి పెర్త్‌కు(12 వేల కిలోమీటర్ల దూరం) తీసుకెళ్తున్న సమయంలో.. రోడ్ల కుదుపులతో ట్రక్కు బోల్ట్ తెరుచుకుని అది కింద పడిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం దాని కోసం వెతుకలాట నడుస్తోంది అక్కడ. ఆ సిల్వర్ క్యాప్సూల్‌లో సీసియం-137 ఉందని, అది చాలా ప్రమాదకరమని అత్యవసర సిబ్బంది ప్రకటించారు. జనవరి 12వ తేదీనే ఆ ట్రక్కు గమ్యస్థానానికి చేరుకుందని, కానీ.. కనిపించకుండా పోయిన ఆ క్యాప్సూల్ ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కాలేదని అత్యవసర సిబ్బంది వెల్లడించారు. ఈ పదార్థాన్ని మైనింగ్ కార్యకలాపాలలో ఉపయోగిస్తారని, దీని రేడియేషన్ వల్ల శరీరం కాలిపోవడం లేదంటే రేడియేషన్ అనారోగ్యానికి గురికావొచ్చని హెచ్చరించారు అధికారులు. ఇది ఎంత మేర డ్యామేజ్ చేస్తుందనే దానిపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కానీ, ఇది అత్యంత ప్రమాదరకమైన వ్యవహారమని చెప్తున్నారు. ప్రస్తుతం పిల్బరా, మిడ్వెస్ట్ గ్యాస్కోయిన్, మిడ్‌ల్యాండ్ గోల్డ్ఫీల్డ్లతో పాటు పెర్త్ మెట్రోపాలిటన్ రీజియన్లలో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. -
జల విలయం: ఆ రాళ్ల కుప్ప కుప్పకూలిందా ?
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ జల విలయంలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది. విద్యుత్ ప్రాజెక్టు సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల్ని కాపాడడానికి సహాయ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మంగళవారం నాడు మరో అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 175 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. రైణి గ్రామంలోని శిథిలాల్లో రెండు మృతదేహాలు లభించినట్టుగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) అధి కారి ఒకరు చెప్పారు. గల్లంతైన వారంతా ఎన్టీపీసీకి చెందిన నిర్మాణంలో ఉన్న తపోవన్–విష్ణుగఢ్, రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నవారు, దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలే ఉన్నారు. శిథిలాలు తొలగించడానికి భారీ మిషన్లు 12 అడుగుల ఎత్తు, 2.5 కి.మీ. పొడవైన సొరంగ మార్గంలో వరద నీటిలో కార్మికులు చిక్కుకొని ఉండడంతో సహాయ చర్యలు క్లిష్టంగా మారాయి. ఐటీబీపీ, ఎన్డీఆర్ఫ్లతో పాటు రాష్ట్ర సహాయ సిబ్బంది ఆ సొరంగ మార్గంలోని శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలను తీసుకువచ్చి విరామమెరుగకుండా పని చేస్తున్నారు. ‘‘రాత్రి నుంచి నిరంతరాయంగా పని చేస్తూ ఉంటే సొరంగ మార్గంలో 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించగలిగాం’’అని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ కుమార్ పాండే చెప్పారు. ఇక వంతెనలు ధ్వంసం కావడంతో పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. మొత్తం 13 గ్రామాలకు చెందిన 2,500 మంది బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. వారందరికీ హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నారు. సీఎం ఏరియల్ సర్వే వరద గుప్పిట్లో చిక్కుకున్న ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఏరియల్ సర్వే నిర్వహించారు. జోషిమఠ్‌లోని ఐటీబీపీ ఆస్పత్రిని సందర్శించారు. మరణం అంచుల వరకు వెళ్లి సురక్షితంగా వచ్చిన 12 మంది కార్మికులతో మాట్లాడారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికే తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా సీఎం తెలిపారు. వరద ప్రాంతాల్లో చికక్కుకున్న కొన్ని గ్రామాల్ని కూడా సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. ఆ పరికరమే కొంప ముంచిందా ..? 1960 దశకంలో చైనాపై నిఘా కోసం నందాదేవి పర్వత ప్రాంతాల్లో అమర్చడానికి తీసుకువెళ్లిన అణు ధార్మిక పరికరం ఇప్పుడు జలవిలయానికి దారి తీసిందని రైణి గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడిన రోజు భయంకరమైన వాసన వచ్చిందని, ఆ సమయంలో ఊపిరి తీయడం కష్టంగా మారిందని వరద బీభత్సంలో అత్యధికంగా నష్టపోయిన రైణి గ్రామవాసులు చెబుతున్నారు. కేవలం మంచుపెళ్లలు, శిథిలాల వల్ల అంత ఘాటైన వాసన రాదని ఆ పరికరం నందాదేవి పర్వత ప్రాంతాల్లోనే ఎక్కడో ఉందని తమ పెద్దలు చెబుతూ ఉండేవారని, బహుశా దాని కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని దేవేశ్వరి దేవి అనే మహిళ అనుమానం వ్యక్తం చేశారు. నందాదేవి పర్వత ప్రాంతాల్లో ఇలాంటి పరికరం ఏదో ఉందని ఇప్పటికే పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చైనా కదలికలపై నిఘా ఉంచడానికి సీఐఏ, ఐబీలు సంయుక్తంగా అణు శక్తి కలిగిన ఒక పరికరాన్ని నందాదేవి పర్వతాల్లో అమర్చడానికి 1965లో తీసుకువెళ్లారని, అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ పరికరాన్ని అక్కడే వదిలేసి వచ్చారని అంటారు. ఏడాది తర్వాత ఒక పర్వతారోహక బృందం అక్కడికి వెళ్లి చూస్తే ఆ పరికరం కనిపించలేదు. గల్లంతైన ఆ పరికరం జీవిత కాలం వందేళ్ల వరకు ఉంటుందని అంచనా. అయితే దీనిపై అధికారికంగా వివరాలు లేవు. రాళ్ల కుప్ప పడిపోయిందా ? ఉత్తరాఖండ్‌లో నందాదేవి పర్వత శ్రేణుల్లోని రాళ్ల కుప్ప బలహీనపడి కుప్పకూలిపోవడంతో ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో చిక్కుకొని ఉండవచ్చునని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జువాలజీ (డబ్ల్యూఐహెచ్‌జీ) అంచనా వేసింది. పర్వతంలోని రాళ్లు ఏళ్ల తరబడి మంచుతో కప్పబడి ఉండడంతో బాగా నాని బలహీనపడి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా సర్వే నిర్వహించిన శాస్త్రవేత్తలు రాళ్ల కుప్ప బలహీనపడడమే వరదలకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కలచంద్ సెయిన్ చెప్పారు. ఈ పర్వత ప్రాంతం అత్యంత లోతున ఏటవాలుగా ఉంటుందని అందువల్ల మంచు చరియలు కరిగి పడిపోగానే వరదలు పోటెత్తాయని తెలిపారు. చదవండి: (విలయం మిగిల్చిన విషాదం) -
ఉత్తరాఖండ్ విలయానికి కారణం ఆ పరికరమేనా?!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లాలో ధౌలిగంగా నది సృష్టించిన జలప్రళయం భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 31 మంది మృతి చెందారు. మంగళవారం (ఫిబ్రవరి 9) మరో ఐదు మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం 203 మంది గల్లంతయ్యారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుకు చెందిన రెండో టన్నెల్లో 30 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారిని కాపడటానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మొదటి టన్నెల్ నుంచి 12 మందిని సురక్షితంగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ భయానక విపత్తుకు అందరూ భావించినట్లు హిమనీనదం పేలుడు కారణం కాదని రైనీ గ్రామస్తులు చెబుతున్నారు. అంతేకాక వారు మరో సంచలన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 56 ఏళ్ల కిందట అధికారులు నందాదేవి శిఖరంపై ఓ రేడియో యాక్టివ్ (రేడియోధార్మిక పదార్థం) పరికరాన్ని ఏర్పాటు చేశారని.. ఆ తర్వాత ఆ పరికరం మిస్సైందని తెలిపారు. తాజా పేలుడుకు ఆ పరికరమే కారణమై ఉండొచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ గ్రామస్తుడు మాట్లాడుతూ.. ‘‘సీఐఏ, ఐబీ అధికారులు 1965లో నందాదేవి శిఖరంపై అణుశక్తితో కూడిన న్యూక్లియర్ పరికరాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. చైనాపై నిఘా ఉంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు. ఈ నేపథ్యంలో పర్వత శిఖరాన్ని పరిశీలించానికి వెళ్లిన అధికారుల బృందం ఊహించని ప్రమాదం బారిన పడింది. దాంతో ప్రాణాలతో బయటపడే క్రమంలో ఆ రేడియో యాక్టివ్ డివైస్‌ను అక్కడే వదిలేశారు. మరుసటి సంవత్సరం అధికారులు అక్కడికి మళ్లీ వెళ్లారు.. అయితే ఆ పరికరం మాత్రం కనిపించలేదు’’ అని గ్రామస్తులు తెలిపారు. రేడియో యాక్టీవ్ పరికరం జీవిత కాలం వందేళ్లు. ఇప్పటివరకు అది ఆ మంచు కొండల్లో ఎక్కడో ఒక చోట ఉండే ఉంటుందని తాము భావిస్తున్నామని తెలిపారు. ప్రమాద సమయంలో ఘాటైన వాసన..! ప్రమాదం జరిగిన నందాదేవి పర్వత శిఖరానికి సమీపంలోనే రైనీ గ్రామం ఉంది. ప్రమాదాన్ని కొంత మంది గ్రామస్తులు దగ్గరి నుంచి చూశారు. ఆ రోజు ప్రమాదం జరిగిన తీరును వారు వివరించారు. ‘‘పర్వత శిఖరం పైనుంచి మంచు కొండ ఒక్కసారిగా విరిగి కుప్పకూలింది. అందులోంచి ఉప్పెనలా నీరు పొంగి రిషిగంగా నదిలోకి దూకింది. దీంతో వరద ఉధృతి పెరిగింది. ఆ ప్రవాహం.. అడ్డుగా ఉన్న రాళ్లను, డ్యామ్‌లను నాశనం చేస్తూ ముందుకు సాగింది. ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది’’ అని గ్రామస్తులు నాటి విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. అలానే శిఖరం పైనుంచి భారీ శబ్దంతో మంచు కొండ విరిగిపడిన వెంటనే అక్కడ ఘాటైన వాసన వచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ‘‘ఆ వాయువు చాలా ఘాటుగా ఉంది. మేం కొద్దిసేపు ఊపిరి పీల్చుకోలేకపోయాం. ఇది మంచు కొండ విరిగిపడటం, శిథిలాల కారణంగా వచ్చి ఉంటుందని మేం భావించడం లేదు. ఆ వాసన చాలా వేరుగా ఉంది. దాంతో మాకు రేడియో యాక్టీవ్ పరికరం మీద అనుమానం వచ్చింది. మా పెద్దలు తరచూ చెప్పే మాటలు గుర్తుకొచ్చాయి. నందాదేవి శిఖరంపై రేడియో యాక్టివ్ పరికరం మిస్సైన ఘటన గురించి మా పెద్దలు మాకు అనేక సార్లు చెప్పారు’’ అని గ్రామస్తులు తెలిపారు. 1965లో నందాదేవి శిఖరంపైకి వెళ్లిన అధికారుల బృందానికి కొంత మంది గ్రామస్తులు సహకరించారు. వారిలో ఒక వ్యక్తి భార్య అయిన ఇమర్తి దేవి(90) ఆదివారం నాడు జరిగిన ప్రమాదంలో మృతి చెందడం మరో విషాదకర అంశం. సంగ్రామ్ సింగ్ రావత్ అనే మరో గ్రామస్తుడు కూడా ఆ రేడియోధార్మిక పరికరంపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఆదివారం నాటి ఘటన అనంతరం భయంతో అతడు తన కుటుంబంతో కలిసి ఊరికి దూరంగా అడవిలో ఉంటున్నాడు. 2018లో పర్యాటక మంత్రి సప్తాల్ మహరాజ్ ఆ రేడియోధార్మిక పరికరం గురించి ప్రస్తావించడం గమనార్హం. ‘నందాదేవి శిఖరంపై మిస్సైన ఆ పరికరం.. ఆ మంచు కొండలను కలుషితం చేస్తోంది. దాన్ని వెలికితీయడానికి తక్షణమే ప్రయత్నాలు ప్రారంభించాలి. ప్రధాని మోదీ ఈ దిశగా చర్యలు తీసుకోవాలి’ అని ఆయన కోరారు. ఏది ఏమైనా ప్రమాదానికి గల కారణాలను అధికారులు తేల్చాల్సి ఉంది. -
రేడియో ధార్మిక ఔషధాల పరిశోధనకు ప్రాధాన్యం
వీఎస్‌యూ వీసీ వీరయ్య నెల్లూరు (టౌన్): రేడియో ధార్మిక ఔషధాల పరిశోధనలకు ప్రాధన్యం ఇవ్వాలని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్ వీరయ్య తెలిపారు. వర్సిటీ కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం న్యూ క్లియర్ కెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్‌పై రెండు రోజుల జాతీయ వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పరిశోధనలను బాబా అటామిక్ రీసోర్స్ సెంటర్, ఇండియన్ అసోసియేషన్ ఫర్ న్యూక్లియర్ కెమిస్ట్రీ అండ్ అల్లైడ్ సైంటిస్ట్, ఇంధిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ నుంచి వచ్చిన శాస్త్రవేత్తల నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. న్యూ క్లియర్ కెమిస్ట్రీ ఆవిష్కరణకు హె న్రీ బెకరల్, క్యూరీ లాంటివారు గట్టి పునాదులు వేశారని చెప్పారు. పశ్చిమ దేశాల్లో వ్యవసాయంలో వస్తున్న పెనుమార్పులుకు పరిశోధనలే కారణమన్నారు. రిజిస్ట్రార్ శివశంకర్ మాట్లాడుతూ నేడు ప్రాకృతిక శిలాజ వనరులను కాపాడుకోవాలంటే అసంప్రాదాయక శక్తి వనరులైన అణుధార్మిక శక్తిని వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అణుశక్తి ఉపయోగంతో తీవ్ర మానవ రుగ్మతల నివారణ, మానవ వికాసాన్ని పొందవచ్చన్నారు. ముంబైకు చెందిన బాబా అటామిక్ రీసోర్స్ సెంటర్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఏవీ రమణారెడ్డి మాట్లాడుతూ అణుశక్తి ఆధునిక పరిశోధనలు క్యాన్సర్ నివారణకు, రోగ నిర్ధారణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఇండియన్ అసోసియేషన్ ఫర్ న్యూక్లియర్ కెమెస్ట్రీ అండ్ అల్లైడ్ సైంటిస్ట్ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణి రేడియోధార్మిక మూలకాలైన కోబాల్ట్, బిస్మత్ లాంటి పదార్థాలను పలు ప్రయోగాల్లో ఉపయోగిస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వెంకటరావు, కెమిస్ట్రీ విభాగాధిపతి విజయ, త్రివేణి, వీరారెడ్డి, వర్సిటీ ఆచార్యులు పాల్గొన్నారు.