
జెరూసలేం: గాజాపై మంగళవారం ఇజ్రాయెల్ దాడిల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాన్‌యూనిస్, డెయిల్ అల్ బలాహ్‌పై జరిగిన ఈ దాడుల్లో పలు భవనాలు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులున్నట్లు చెప్పారు. టుల్కారెమ్‌లోని నూర్‌షామ్స్ శరణార్థి శిబిరంపై దాడుల్లో ఐదుగురు చనిపోయారు. ఇజ్రాయెల్ ఆంక్షలతో గాజాలో 10 లక్షల మందికి నెల రోజులుగా కనీస సాయం కూడా అందడం లేదని ఐరాస తెలిపింది.
హమాస్ చెర నుంచి బందీని కాపాడిన ఆర్మీ
హమాస్ చెరలో ఉన్న తమ పౌరుడిని మంగళవారం ఇజ్రాయెల్ ఆర్మీ కాపాడింది. గతేడాది అక్టోబర్ ఏడున గాజా సరిహద్దుల సమీపంలోని ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ మిలిటెంట్లు దాడి చేసి 1,200 మందిని చంపడం, 250 మందిని బందీలుగా పట్టుకోవడం తెలిసిందే. వారిలో క్వాయిద్ ఫర్హాన్ అల్‌కాదీ(52) అనే వ్యక్తిని గాజా కాపాడినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. హమాస్ చెర నుంచి ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 8 మందిని కాపాడింది. ఇంకా 110 మంది బందీలుగా ఉన్నట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment