
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, అప్పుడప్పుడు హీరోగా నటిస్తున్న అజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పెషల్’ (ద స్టోరీ ఆఫ్ ఎ మైండ్ రీడర్). వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘ద స్టోరీ ఆఫ్ మైండ్ రీడర్ అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఒక ప్రత్యేక కథాంశంతో రూపొందుతున్న వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రమిది. హాలీవుడ్ తరహా స్క్రిప్టుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అజయ్ వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.
ఈ సినిమాలో ఒకటే పాట ఉంటుంది. కథ డిమాండ్‌ను బట్టి మాల్దీవుల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. మూడు రోజుల క్లైమాక్స్ చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్, సంగీతం: మణ్యం యన్‌వియస్.
Comments
Please login to add a commentAdd a comment