
అనగనగా ఓ రాజుగారి ఇల్లు
అది రాజుగారి ఇల్లు. ఆ ఇంట్లో ఉండటానికి కొంత మంది వచ్చారు. కానీ సరిగ్గా ఏడో రోజు అనుకోని సంఘటనలు జరిగాయి.
అది రాజుగారి ఇల్లు. ఆ ఇంట్లో ఉండటానికి కొంత మంది వచ్చారు. కానీ సరిగ్గా ఏడో రోజు అనుకోని సంఘటనలు జరిగాయి. మరి తర్వాత ఏం జరిగింది...? అసలు రాజుగారు ఎవరు? అనేది తెలియాలంటే ‘రాజుగారింట్లో 7వ రోజు’ చూడాల్సిందే. అజయ్, భరత్, అర్జున్ ప్రధానపాత్రల్లో భరత్ ఫిలిం పతాకంపై భరత్ కుమార్ పీలం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫిరోజ్ రాజ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా లీడ్ రోల్‌లో నటిస్తున్నా, హారర్, కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి కె,కుమార్, సంగీతం: కనిష్క్.