మూడు తరాలు... మూడు ప్రేమకథలు | Three generations... three love stories | Sakshi
Sakshi News home page

మూడు తరాలు... మూడు ప్రేమకథలు

Published Sun, Sep 15 2013 12:10 AM | Last Updated on Fri, Sep 1 2017 10:43 PM

మూడు తరాలు... మూడు ప్రేమకథలు

మూడు తరాలు... మూడు ప్రేమకథలు

ఒకే అపార్ట్‌మెంట్‌కి చెందిన మూడు తరాలకు సంబంధించిన మూడు జంటల ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘చిన్ని చిన్ని ఆశ’. రాజీవ్ సాలూరి, అజయ్, అపర్ణానాయర్ ముఖ్య తారలు. డా.కిరణ్ దర్శకుడు. శ్రీనివాస్ గరిమెళ్ల నిర్మాత. దిగ్దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘భావోద్వేగాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. 
 
సింగీతంగారు పోషించిన పాత్ర సినిమాకే వన్నె తెచ్చింది. అన్ని వర్గాలనూ అలరిస్తుందీ చిత్రం’’ అన్నారు. ఈ నెలాఖరున కానీ, వచ్చే నెల తొలివారంలో గానీ సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ధన్య, బాలకృష్ణన్, వాసు ఇంటూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: వీఎన్ సతీష్, సంగీతం: కార్తీక్ ఎం., కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: దాము నర్రావుల, సహ నిర్మాత: ఇందుకూరి నరసింహరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.ఎస్.వి.శివసాయికృష్ణ.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement