‘రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస, హనీ ట్రాప్’ వంటి చిత్రాలు తీసిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం ‘69 సంస్కార్ కాలనీ’. ఎస్తర్ నోరోన్హా, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల మూడో వారంలో విడుదల కానుంది.
ఈ సందర్భంగా బి. బాపిరాజు మాట్లాడుతూ– ‘‘నేను, సునీల్‌గారు ఒక సినిమా సెన్సార్ పని మీద ముంబై వెళ్లాం. అక్కడ మాకు ఎదురైన కొన్ని సంఘటనలతో పాటు పేపర్‌లో, సోషల్ మీడియాలో వచ్చిన వాస్తవ సంఘటనతో ‘69 సంస్కార్ కాలనీ’ నిర్మించాం’’ అన్నారు. ‘‘కమర్షియల్‌గా హిట్ చేయాలనే ఉద్దేశ్యంతో కాకుండా సామాజిక బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ‘69 సంస్కార్ కాలనీ’ తీశాం’’ అని సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. కథారచయిత్రి గాయత్రి స్వాతి మంత్రిప్రగడ, ఎడిటర్ కృష్ణ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment