అమ్మ మాట.. | give job the families dead for telangana | Sakshi
Sakshi News home page

అమ్మ మాట..

Published Fri, Apr 18 2014 1:08 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

అమ్మ మాట.. - Sakshi

అమ్మ మాట..

 సేతినిండా పని కల్పించాలె

నా ఒక్కగానొక్క కొడుకు అజయ్ డిగ్రీ సదువుకుంట, తెలంగాణ కోసం పెట్టే మీటిం గులకు పోయేటోడు. తెలంగాణ అస్తలేదని బాధపడేటోడు. తెలంగాణ రాదని అందరూ చెప్పుకుంటుంటే ఏడ్చేటోడు. తెలంగాణ అస్తే ఉద్యోగమస్తది అనేటోడు. 2010 మే నెల 25న ఇంట్లోనే ఉరేసుకుని చచ్చిపోయిండు. ఇప్పడు తెలంగాణ అచ్చింది నా కొడుకు ఎలాగూ లేడు. కాబట్టి కనీసం సదువుకున్నోళ్లకు అయినా ఉపాధి అవకాశం సూపెట్టాలె.
 
 సొంతంగ రాష్ట్రం అచ్చెదాక ఎట్ల కొట్లాడిర్రో, అట్లే ప్రతి ఊరు బాగయ్యేదాక అందరు పాటుపడాలె. తెలంగాణ కోసం చనిపోయిన పిల్లల కుటుంబాలకు ఇంటి కో ఉద్యోగం ఇయ్వాలె. స్వాతంత్య్ర సమరయోధులకు వచ్చే సదుపాయాలు కల్పించాలె. సేతి నిండ పని దొరుకుతనే కడుపు నిండ తిండి దొరుకుతది. ఉపాధి అవకాశాలు పెరుగుతనే అందరు పనిల పడతరు.
 సేకరణ : విజయేందర్‌రెడ్డి, చొప్పదండి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement