
భార్య వేధిస్తోందంటూ ఓ వైద్యుడు సెల్‌టవర్ ఎక్కాడు.
సాక్షి, జగిత్యాల: భార్య వేధిస్తోందంటూ ఓ ఆర్‌ఎంపీ వైద్యుడు సెల్‌టవర్ ఎక్కాడు. జగిత్యాల పట్టణంలో అజయ్ అనే వ్యక్తి ఆర్‌ఎంపీగా పనిచేస్తున్నాడు. భార్య వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని, విడాకులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. అక్రమ కేసులు పెట్టి భార్య వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు.
' నా భార్య వేధిస్తోంది.. విడాకులు ఇప్పించి ఆదుకోండి..' అంటూ చిట్టీలు రాసి సెల్ టవర్ నుంచి కిందకు విసురుతూ నిరసన తెలుపుతున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకి చేరుకుని అజయ్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.