![Actor Ajay Shares About His Movie Career And Personal Life In Latest Interview - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/14/Ajay.jpg.webp?itok=xIulaX1-)
నటుడు అజయ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అజయ్ హీరోలకు సమానమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశ ముదురు, ఛత్రపతి వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్‌గా, ప్రతినాయకుడి పాత్రలు పోషించిన ఆయన ఈ మధ్య తెరపై అరుదుగా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే అజయ్ ఆ మధ్య నటనకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.
చదవండి: లైగర్ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే
చాలా గ్యాప్ అనంతరం ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన అజయ్ ప్రస్తుతం ఆడపదడప చిత్రాలు చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తున్నాడు. ఇక ఇటీవల 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన అజయ్ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆయన తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇవ్వడంపై స్పందించాడు. తనకు తగ్గ పాత్రలు రావడం లేదని, అందుకే ఈ గ్యాప్ వచ్చిందన్నాడు.
చదవండి: రెమ్యునరేషన్ డిమాండ్ చేయను.. ఎంత ఇస్తే అంత తీసుకుంటా: నిధి అగర్వాల్
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నేనేప్పుడు పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేశాను. ఈ 22 ఏళ్లు అదే చేశాను. ఇకముందు కూడా పాత్ర నచ్చితేనే చేస్తాను. సినిమాలో మన రోల్ ఎంతసేపు ఉంది, ఎన్నిసార్లు కనిపించింది అనేది ముఖ్యం కాదు. అది ఎంత ప్రభావవంతంగా ఉందనేది పరిగణలోకి తీసుకుంటాను. అందుకు నేను చేసిన పాత్రలన్ని ప్రేక్షకుల్లో మదిలో అల నిలిచిపోయాయి’ అన్నాడు. ఆ తర్వాత విలన్ రోల్స్‌పై స్పందిస్తూ.. శ్రీ మహాలక్ష్మి మూవీ సమయంలో చోటు చేసుకున్న ఓ సంఘటనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ‘‘కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ ‘లక్ష్మీ కల్యాణం’ సినిమా సమయంలో ఒక సంఘటన జరిగింది.
చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి
అది నాకిప్పటికి గుర్తుంది. ఈ సినిమాలో ఓ రేప్ సీన్ ఉంది కదా. దానికోసం ఓ మోడల్‌ను తీసుకున్నారు. అయితే ఆమెకు అది రేప్ చేసే సీన్ అనే విషయం చెప్పలేదు. నేను వెళ్లి చేయిపట్టుకోగానే ఆమె గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దాంతో నేను డైరెక్టర్‌కి ఆ సీన్ చేయలేను అని చెప్పా. వందల మంది ముందు రేప్ సీన్ చేయడం చాలా చిరాకుగా ఉంటుంది. ఆ తర్వాత నాకు మళ్లీ రేప్ సీన్లో నటించే అవసరం, సందర్భం రాలేదు. ఆ విషయంలో మాత్రం నేను చాలా సంతోషిస్తాను’ అంటూ చెప్పకొచ్చాడు. అయితే తనకు నచ్చిన పాత్రలు రాకుంటే శాశ్వతంగా సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తానంటూ అజయ్ ఓపెన్‌గా కామెంట్స్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment