మార్చి నెలాఖరుకల్లా మెద క్‌లో ‘హైరిస్క్ కేంద్రం’
మెదక్‌టౌన్, న్యూస్‌లైన్ : మాతాశిశు మరణాలను నివారించేందుకు మార్చి నెలాఖరు కల్లా మెదక్‌లో ‘హైరిస్క్ కేంద్రం’ ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. శుక్రవారం ఆమె, కేంద్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ అరుణ్‌సింగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీలతో కలిసి మెదక్ ఏరియా ఆస్పత్రిని సందర్శిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రిలో మార్చి 31లోగా ఏర్పాటు చేయనున్న హైరిస్క్ కేంద్రానికి కాంట్రాక్ట్ పద్ధతిన సిబ్బందిని నియమించుకోవడంతో పాటు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆదేశిం చారు. ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకు 125 కాన్పులు జరుగుతున్నాయనీ, వీటిని 250కి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇందుకోసం కావాల్సిన సిబ్బందిని, పరికరాలను సమకూరుస్తామన్నారు. ఆ స్పత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే సిద్దిపేటలో హైరిస్క్ కేంద్రం ప్రారంభించామని త్వరలోనే మరికొన్ని చోట్ల ప్రారంభించి మాతాశిశు మరణాలను తగ్గించేం దుకు కృషి చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ తెలిపారు. జి ల్లా కలెక్టర్ ఆరోగ్య విషయాలపై చూపిస్తున్న శ్రద్ధను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జాయిం ట్ కలెక్టర్ మూర్తి, ఆర్డీఓ వనజాదేవి, డీసీహెచ్ వీణాకుమారి, డీఎం,హెచ్‌ఎం పద్మ, డీపీఎం జగన్నాథ్‌రెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మి, వైద్యులు చంద్రశేఖర్, శివదయాల్, హేమ్‌రాజ్ పాల్గొన్నారు.