
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘చక్రవ్యూహం’. ‘ది ట్రాప్’ అన్నది ఉపశీర్షిక. చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై సావిత్రి నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా చెట్కూరి మధుసూదన్, సావిత్రి మాట్లాడుతూ.. ‘‘మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. హత్య కేసును ఛేదించేందుకు హీరో ఎలాంటి వ్యూహం పన్నాడన్నది ఆసక్తిగా ఉంటుంది. పోలీస్ పాత్రలో అజయ్ నటన ఆకట్టుకుంటుంది’’ అన్నారు.