
సుమన్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం జనం. వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నవంబర్ 10న ప్రపంచం వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
కథ విషయానికొస్తే ప్రతీ తల్లి తన బిడ్డను గొప్ప లక్షణాలతో, ఉన్నత విలువలతో పెంచాలనుకుంటుంది. కానీ ఎలక్షన్స్‌లో ఓటు విషయానికి వచ్చేసరికి కులం, మతం, ప్రాంతం, డబ్బు లాంటి ప్రలోభాలకు లోబడి తప్పు దారిలో వెళ్లేలా చేస్తుంది. ప్రజలకు ఎంతో మంచి చెయ్యాలనే రాజకీయాల్లోకి వచ్చే ప్రతీ నాయకుడు.. ప్రజల ఓట్ల కోసం, ఎలక్షన్స్‌లో గెలవడం కోసం ఎలా తప్పు దారి పడుతున్నాడన్న దానిపైనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో కిషోర్, వెంకట రమణ, ప్రగ్య నయన్, మౌనిక, లక్కీ, జయవాని, రషీదా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment