Actor Ajay Remembers His Role in Vikramarkudu Movie in Latest Interview - Sakshi
Sakshi News home page

Ajay: షూటింగ్‌లో ప్రమాదం.. డైరెక్టర్‌ అయితే చనిపోయాను అనుకున్నాడు: అజయ్‌

Published Sat, Jan 7 2023 1:34 PM | Last Updated on Sat, Jan 7 2023 2:38 PM

Actor Ajay Remembers His Role in Vikramarkudu Movie in Latest Interview - Sakshi

న‌టుడు అజ‌య్.. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అజయ్‌ హీరోలకు సమానమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశ ముదురు, ఛ‌త్ర‌ప‌తి వంటి ఎన్నో హిట్‌ చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్‌గా, ప్రతినాయకుడి పాత్రలు పోషించిన ఆయన ఈ మధ్య తెరపై అరుదుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆడపదడపా చిత్రాలతో సరిపెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. 

చదవండి: నేను అలా అనడం నచ్చలేదేమో: ఆ వివాదంపై రష్మిక స్పందన

ఈ సందర్భంగా విక్రమార్కుడు తర్వాత ఇంట్లో పిల్లలు తన దగ్గరికి రాలేదని, తనని దారుణంగా చూశారని చెప్పాడు. ఈ మూవీ వచ్చి 15 ఏళ్లు అవుతున్న ఇప్పటికీ పిల్లలు ‘విక్రమార్కుడు టిట్లు’ అనే పిలుస్తారన్నాడు. దీంతో మీ భార్య కూడా భయపడ్డారా? అని హోస్ట్‌ చమత్కరించగా... మనం భయపడటం తప్పిదే.. వాళ్లు భయపడేది ఉండదంటూ ఫన్నిగా సమాధానం ఇచ్చాడు. ఇక హీరోలతో ఫైట్‌ సీన్స్‌ చేసేటప్పుడు తన హైట్‌ వల్లు ఇబ్బంది పడేవారన్నాడు. అందుకే తన సినిమాల్లో హీరోలు హైట్‌ ఉండాలని కోరుకునేవాడిని అని పేర్కొన్నాడు. 

చదవండి: స్టార్‌ హీరోపై నటి తీవ్ర ఆరోపణలు.. ‘నన్ను లైంగికంగా వేధించాడు’

ఇక షూటింగ్‌లో ఎప్పుడైన గాయపడ్డారా? అని అడగ్గా.. ఓ సినిమా షూటింగ్‌లో కొద్దిలో చనిపోయేవాడినని, తృటిలో ప్రమాదం తప్పిందన్నాడు. డైరెక్టర్‌ అయితే తాను చనిపోయేననే అనుకున్నాడంటూ షాకింగ్‌ విషయం బయటపెట్టాడు. ఇక సినిమాలకు ముందు ఇంట్లో నుంచి పారిపోయి నేపాల్‌ వెళ్లానన్నాడు. అసలు ఎందుకు పారిపోయానో కూడా తెలియదని, అక్కడ అన్ని ప్రాంతాలు తిరిగానన్నాడు. కొద్ది రోజులకు డబ్బులు అయిపోయాయని, దీంతో టిబెట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పని చేశానన్నాడు. అక్కడ గిన్నెలు కడిగానని, ఆ తర్వాత వచ్చిన డబ్బులతో తిరిగి ఇండియాకు వచ్చానంటూ చెప్పుకొచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement