
అజయ్, శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అర్థం’. పలు చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్‌ఎక్స్ నిపుణుడిగా పని చేసిన మణికాంత్ తెల్లగూటి ఈ సినిమాకి రచయిత, దర్శకుడు. ‘నాటకం’ చిత్రనిర్మాతల్లో ఒకరైన రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. త్వరలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నాం.
రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాస్తున్నారు’’ అన్నారు. ‘‘కుటుంబ విలువలను కాపాడటంతో పాటు మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. సైకలాజికల్ థ్రిల్లర్ కథకి వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం’’ అన్నారు మణికాంత్ తెల్లగూటి. ‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన మహేంద్ర, రామ్‌గోపాల్ వర్మ ‘మర్డర్’లో కథానాయికగా నటించిన సాహితీ అవంచ, దేవి ప్రసాద్, సాయి దీనా, వాసు విక్రమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ గంగనమోని, సంగీతం: సన్నీ ఆస్టిన్, చిన్న స్వామి, అసోసియేట్ నిర్మాత: ఉమా కూచిపూడి, సహనిర్మాతలు: పవన్ జానీ, వెంకట రమేష్.
Comments
Please login to add a commentAdd a comment