అజయ్, వీర్తి వఘాని హీరో హీరోయిన్లుగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బిజి గోవిందరాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘డైమండ్ రాణి’ పాటను దర్శకుడు మారుతి విడుదల చేశారు.
‘‘వాలు కన్నుల్లో మాగ్నెట్టు దాగుందే..’ అంటూ మొదలయ్యే ఈ పాట ‘నా డైమండు రాణివే నీ బాయ్ ఫ్రెండ్ కానీవే’.. అంటూ సాగుతుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర.
Comments
Please login to add a commentAdd a comment