
Amitabh Bachchan First Look Trailer Released: సూర్య, రీతూ శ్రీ హీరో హీరోయిన్లుగా జె. మోహన్‌కాంత్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అమితాబ్ బచ్చన్’. తార శ్రీ క్రియేటివ్ వర్క్స్‌పై జె. చిన్నారి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. పారిశ్రామికవేత్త సుదర్శన్ రెడ్డి ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా సతీష్ రెడ్డి, కందుల శివకుమార్, మణి పాల్గొన్నారు.
‘‘మా సినిమా అమితాబ్ బచ్చన్‌గారి బయోపిక్ కాదు. ఓ మంచి ప్రేమకథ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. చిల్లర వేణు, ఉన్నికృష్ణ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం అశ్రీత్ అయ్యంగార్ అందించగా సహనిర్మాతగా అక్కల శ్రీనివాస్ రాజు వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment