‘విద్య అనేది వ్యాపారం కాదు.. అదొక సేవ. ఓ కాలేజ్ గొప్పదయ్యేది ఫీజు వల్లో, డొనేషన్ వల్లో కాదు.. మంచి విద్యార్థుల వల్ల.. కానీ ఇలాంటి ఇడియట్స్‌కు అడ్మిషన్ ఇస్తే బయటకెళ్లేది స్టూడెంట్స్ కాదు.. క్రిమినల్స్’ అంటూ ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్‌తో ‘యువరత్న’ సినిమా ట్రైలర్ విడుదలైంది. కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్, సయేషా సైగల్ జంటగా నటించిన చిత్రం ‘యువరత్న’. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించారు. హోంబలే ఫిలింస్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 1న తెలుగు, కన్నడ భాషల్లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ‘యువరత్న’ ట్రైలర్‌ని విడుదల చేశారు.
‘‘హోంబలే ఫిలింస్ సంస్థ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ మూవీ ‘యువరత్న’. కళాశాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. యూత్‌తో పాటు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఈ కథ ఉంటుంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ధనుంజయ, ప్రకాశ్‌రాజ్, దిగంత్, సోనూ గౌడ, సాయికుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్, కెమెరా: వెంకటేశ్ అనుగ్‌రాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ గౌడ.
This looks amazing. Best wishes to the team! #YuvarathnaaTrailerhttps://t.co/XHoNdmSEqZ@PuneethRajkumar @VKiragandur @hombalefilms @SanthoshAnand15 @MusicThaman @Karthik1423
— Sanjay Dutt (@duttsanjay) March 20, 2021
Comments
Please login to add a commentAdd a comment