
Ksheera Saagara Madhanam Trailer: ‘‘క్షీర సాగర మధనం’ సినిమా నేను చూశా.. చాలా బాగుంది. మంచి కథాంశంతో తెరకెక్కించిన అనిల్ పంగులూరికి దర్శకుడిగా ఉజ్వల భవిష్యత్ ఉంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత శరత్ మరార్ అన్నారు. మానస్ నాగులపల్లి, సంజయ్ కుమార్ హీరోలుగా, అక్షత సోనావని హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘క్షీర సాగర మధనం’. శ్రీ వెంకటేశ పిక్చర్స్‌తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్‌లో నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 6న విడుదలకానుంది.
ఈ చిత్రం ట్రైలర్‌ని శరత్ మరార్ విడుదల చేశారు. అనిల్ పంగులూరి మాట్లాడుతూ– ‘‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందిన చిత్రమిది. మా చిత్రాన్ని ఎంతో సపోర్ట్ చేస్తున్న శరత్ మరార్‌గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసాడ, కెమెరా: సంతోష శానమోని, సహ–దర్శకుడు: కిషోర్ కృష్ణ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి.
Comments
Please login to add a commentAdd a comment