ఆకట్టుకుంటున్న ‘పంగా’ ట్రైలర్‌ | Kangana Panga Trailer Release | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న ‘పంగా’ ట్రైలర్‌

Published Tue, Dec 24 2019 9:06 AM | Last Updated on Tue, Dec 24 2019 11:50 AM

Kangana Panga Trailer Release - Sakshi

సాక్షి, సినిమా : బాలీవుడ్‌ కథానాయిక, సంచలన నటి కంగనా రనౌత్‌ నటించిన తాజా చిత్రం పంగా ట్రైలర్‌ సోమవారం విడుదలైంది. కబడ్డీ క్రీడ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అశ్వినీ అయ్యర్‌ తివారీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మాజీ మహిళా కబడ్డీ చాంపియన్‌ జయ పాత్రను కంగనా రనౌత్‌ పోషిస్తోంది. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్‌లో కంగనా గృహిణిగా, పిల్లల తల్లిగా, రైల్వే ఉద్యోగిగా కనిపిస్తోంది. జనవరి 24న ఈ చిత్రం విడుదలవుతోంది. ఫాక్స్‌ స్టార్‌ స్టూడియో నిర్మించిన ఈ చిత్రంలో రిచా చద్దా, పంకజ్‌ త్రిపాఠిలు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. నీనా గుప్తా కంగనా రనౌత్‌ తల్లి పాత్రలో నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement