Niharika And Vijay Sethupathi O Manchi Roju Chepta Movie OTT Release Date - Sakshi
Sakshi News home page

O Manchi Roju Chepta: ఓటీటీలో నిహారిక, విజయ్‌ సేతుపతి 'ఓ మంచి రోజు చూసి చెప్తా'

Published Sun, Aug 21 2022 7:59 PM | Last Updated on Mon, Aug 22 2022 10:58 AM

Niharika Vijay Sethupathi O Manchi Roju Chepta Will Stream On Aha - Sakshi

Niharika Vijay Sethupathi O Manchi Roju Chepta Will Stream On Aha: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి, మెగా డాటర్‌ నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో 2018లో విడుదలైన తమిళ చిత్రం "ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్". ఈ చిత్రం తెలుగులో "ఓ మంచి రోజు చూసి చెప్తా" అనే టైటిల్‌తో రిలీజైంది. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ రావూరి వెంకటస్వామి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు అప్పట్లో క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఈ మూవీ ఇప్పుడు తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో అలరించడానికి రెడీ అయింది. 

దీనికి సంబంధించిన తాజా ట్రైలర్‌ను విడుదల చేసింది ఆహా. అయితే విజయ్‌ సేతుపతికి, నిహారికకు తెలుగులో ఉన్న క్రేజ్‌ దృష్ట్యా ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నిహారిక, విజయ్‌తోపాటు గౌతమ్‌ కార్తిక్‌ మరో కీలక పాత్ర పోషించాడు. ఇందులో విజయ్‌ దొంగతనాలు చేసే యముడిగా వేషం కట్టాడు. అతడిని నిహారిక మామయ్య అని పిలుస్తుంటుంది. ఈ క్రమంలో ఓసారి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అతడు నోరు తెరిచి అడగ్గా చేసుకుంటాను మామయ్యా.. అంటూ సంతోషంగా సమాధానమిచ్చింది. వినోదాన్ని పంచుతున్న ఈ ట్రైలర్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఆగస్టు 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement