
అథర్వా, మిష్టి, అనైకా సోటి హీరో హీరోయిన్లుగా బద్రీ వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డస్టర్ 1212’. మరిపి విద్యాసాగర్ (వినయ్), విసినిగిరి శ్రీనివాస రావు నిర్మించిన ఈ సినిమా మార్చి 4న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసిన చిత్రం ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో కుటుంబమంతా కలిసి చూసేలా నిర్మించాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వీరం రమణ, సంగీతం: యువన్ శంకర్‌రాజా.
Comments
Please login to add a commentAdd a comment