
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ నిర్మాత, ఐకాన్ అల్లు అర్జున్ తండ్రి అని చాలామంది అంటారు. కానీ అప్పట్లో చిరంజీవితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారని ఇప్పటి జనరేషన్ కుర్రాళ్లకు చాలామందికి తెలియదు. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న ఆయనతో ప్రయోగం చేద్దామని టాలీవుడ్ యువ దర్శకుడు ఒకరు అనుకున్నారు. కానీ ఆ పాత్ర బ్రహ్మానందంతో చేయించాడు. ఇంతకీ ఏంటా సినిమా?
(ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?)
టతరుణ్ భాస్కర్ పేరు చెప్పగానే 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది?' లాంటి క్రేజీ మూవీస్ గుర్తొస్తాయి. ఇప్పుడా డైరెక్టర్ చాలా ఏళ్ల తర్వాత తీస్తున్న సినిమా 'కీడా కోలా'. థ్రిల్లర్ ఎంటర్‌టైనింగ్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ సినిమాలో సాధారణ ఆర్టిస్టులే ఎక్కువగా నటించారు. సినిమా ఆసాంతం వీల్ ఛైర్‌లో కూర్చుని ఉండే వరదరాజులు అనే పాత్రలో మాత్రం బ్రహ్మానందం యాక్ట్ చేశాడు.
అయితే స్టోరీ అంతా రెడీ కాగానే వరదరాజులు పాత్ర అల్లు అరవింద్ చేస్తే బాగుంటుందని తరుణ్ భాస్కర్ అనుకున్నాడు. తాజాగా 'కీడా కోలా' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని రానాతో చెప్పాడు. అల్లు అరవింద్ దగ్గరకెళ్లి.. మీరు యాక్ట్ చేస్తారా అని తరుణ్ భాస్కర్ అడిగితే.. ఆయన సింపుల్‌గా నవ్వి ఊరుకున్నారట. దీంతో ఆ పాత్ర కోసం బ్రహ్మీ లైనులోకి వచ్చాడు. నవంబరు 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
(ఇదీ చదవండి: 'జైలర్' విలన్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?)
Comments
Please login to add a commentAdd a comment