
బీజేపీ అభ్యర్థి సుధాకర్‌కు మద్దతుగా బ్రహ్మానందం రోడ్‌షో
కర్ణాటక: చిక్కబళ్లాపురం బీజేపీ అభ్యర్థి డాక్టర్ సుధాకర్ తరఫున తెలుగు హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కమ్మగుట్టహళ్లి, మండికల్లు పెరేసంద్ర పరిధిలో సుధాకర్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి సుధాకర్ కృషి చేశారని, ఆయన్ను గెలిపించాలని కోరారు.
అంతకుముందు సుధాకర్ మాట్లాడుతూ చిక్కబళ్లాపురంలో నీట్ అకాడమి ఏర్పాటు చేసి ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రూ.2వేలు వంతున పంచుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment