కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం | Brahmanandam, Raja Goutham New Movie Titled as Brahmanandam | Sakshi
Sakshi News home page

రియల్‌ లైఫ్‌లో తండ్రీకొడుకులు.. సినిమా‌ కోసం తాతామనవడిగా

Published Thu, May 9 2024 12:24 PM | Last Updated on Thu, May 9 2024 12:24 PM

Brahmanandam, Raja Goutham New Movie Titled as Brahmanandam

నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్‌ ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంలో తాత, మనవడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌కల్‌ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్‌ కీలక  పాత్రలో కనిపించనున్నారు.

సావిత్రి, శ్రీ ఉమేష్‌ యాదవ్‌ సమర్పణలో రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించనున్న ఈ సినిమాని ప్రీ–లుక్‌ పోస్టర్, వీడియోతో ప్రకటించారు. ‘‘బ్రహ్మా ఆనందం’ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఈ ఏడాది డిసెంబర్‌ 6న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మితేష్‌ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిస΄ాటి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పి. దయాకర్‌ రావు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement