కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మనందం ప్రచారం.. ఏ పార్టీ తరపునో తెలుసా? | Telugu Comedian Brahmanandam Campaign Karnataka Elections for BJP | Sakshi
Sakshi News home page

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మనందం ప్రచారం.. ఏ పార్టీ తరపునో తెలుసా?

May 4 2023 6:27 PM | Updated on May 4 2023 6:43 PM

Telugu Comedian Brahmanandam Campaign Karnataka Elections for BJP - Sakshi

బెంగుళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రణరంగం చివరి అంకానికి చేరుకుంటోంది. ఎన్నికలకు ఇంకా వారం రోజులు కూడా లేకపోవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ, అమిత్‌ షా, ప్రియాంక గాంధీ, ఖర్గేతో సహా అన్ని పార్టీల ముఖ్యనేతలంతా రాష్ట్రంలోనే మకాం వేశారు. త్రిముఖ పోరు నెలకొన్న కర్ణాటకలో  గెలుపెవరిదనేది ఉత్కంఠగా మారింది.

కాగా ఎన్నికల ప్రచారంలో సినీతారలు మెరుస్తున్నారు. ఇప్పటికే కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారు. మరోవైపు  కాం‍గ్రెస్‌కు మద్దతుగా రాహుల్‌గాంధీ ప్రచారంలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ సందడి చేశారు. తాజాగా ఈ జాబితాలోకి మరో నటుడు చేరాడు. అయితే ఆయన టాలీవుడ్‌కు చెందిన ఫేమస్‌ కమెడియన్‌ కావడం గమనార్హం.
చదవండి: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రచారం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ కోసం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కర్ణాటక మంత్రిగా  ఉన్న కే సుధాకర్ తరఫున బ్రహ్మానందం ప్రచారం నిర్వహించారు.  చిక్కబళ్లాపూర్‌ బీజేపీ అభ్యర్థి సుధాకర్‌కు మద్దతు తెలుపుతూ ఆయనకు ఓటేయాలంటూ క్యాంపెయిన్ నిర్వహించారు. రోడ్డు షో ద్వారా ప్రజలతో సందడి చేశారు. 
చదవండి: Anil Dujana: యూపీలో ఎన్‌కౌంటర్‌.. మరో గ్యాంగ్‌స్టర్‌ హతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement