బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టిన రచ్చ ప్రస్తుతం వెండితెరపై సందడి చేస్తున్నాడు. ఈ కామెడీ షో నుంచి బయటకు వచ్చిన రవి వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. దాదాపు 100 సినిమాల్లో నటించిన తొలి జబర్దస్త్ కంటెస్టెంట్‌గా రవి గుర్తింపు పొందాడు. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో అలరించిన రచ్చ రవి తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. తాను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చానన్నాడు. ఈ సందర్భంగా జబర్దస్త్ మానేయడంపై వివరణ ఇచ్చాడు.
చదవండి: ఆ హీరోయిన్‌ని బ్లాక్ చేసిన బన్నీ! స్క్రిన్ షాట్స్‌తో నటి ఆరోపణలు..
‘నిజానికి జబర్దస్త్ నాకు తల్లి లాంటిది. సినిమాల్లో అవకాశాలు వస్తుండటంతో డేట్స్ సరిగ్గా అడ్జస్ట్ చేసుకోలేకపోయాను. అందువల్లే జబర్దస్త్ మానేసి సినిమా కెరీర్‌పై ఫోకస్ పెట్టాను’ అని చెప్పాడు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ఆర్థిక సమస్యలు ఉన్న ఈ షో నుంచి బయటకు వచ్చాను. అప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అదే సమయంలో బ్రహ్మానందం గారు నన్ను పిలిచి ఓ సలహా ఇచ్చారు. ఆయన వల్లే నా సొంతింటి కల నిజమైంది. ఆయన ఓ ఇల్లు చూపించారు.
చదవండి: తారక్ వండర్ కిడ్: ఎన్టీఆర్‌పై శుభలేఖ సుధాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఇది తీసుకోరా నీకు బాగా కలిసి వస్తుంది. వాస్తు బాగుంది. ఎంత డబ్బు అయిన పర్వాలేదు నేను ఇస్తాను. ఇప్పటికిప్పుడు రూ. 5 లక్షలు అయిన పర్వలేదు నేను ఇస్తాను’ అని అన్నారు. అయన చెప్పినప్పుటి నుంచి నాకు డబ్బు కలిసి వచ్చింది. దాంతో ఆ ఇల్లు కొనుక్కున్నాను. బ్రహ్మానందంగారు చెప్పినట్టుగానే నాకు ఆ ఇల్లు బాగా కలిసి వచ్చింది. ఆ ఇంటికి మారాక నాకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నా. నటుడిగా మంచి పేరు సంపాదించాను. ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డాను’’ అంటూ రచ్చ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ ఇంటి గృహప్రవేశానికి కూడా ఆయన వచ్చారంటూ రచ్చ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే బ్రహ్మానందంగారి దగ్గర డబ్బు తీసుకోకుండానే ఇల్లు కొన్నానని స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment