'గేమ్ ఛేంజర్' సెట్‌లో చరణ్.. ఆ పుస్తకంపై స్పెషల్ ట్వీట్ | Ram Charan With Brahmanandam In Game Changer Shoot | Sakshi
Sakshi News home page

Ram Charan: చరణ్ సినిమాలో బ్రహ్మీ నటిస్తున్నారా? పిక్ వైరల్

Published Wed, Jan 10 2024 5:41 PM | Last Updated on Wed, Jan 10 2024 6:00 PM

Ram Charan With Brahmanandam Nenu Book In Game Changer Shoot - Sakshi

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ని ప్రముఖ హాస్యనటుడు బ్ర‌హ్మానందం మ‌ర్యాద‌ పూర్వ‌కంగా క‌లిశారు. బ్రహ్మీ.. తన జీవితంలోని అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో, అనుభ‌వాల‌తో 'నేను' అనే పుస్తకాన్ని రాశారు. ఈ మధ్యే దీన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ పుస్తకాన్ని హీరో చరణ్‌కి బ్రహ్మానందం బహుకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన మెగాహీరో.. తన అభిప్రాయాన్ని కూడా క్యాప్షన్ రూపంలో రాసుకొచ్చాడు.

(ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా)

'బ్ర‌హ్మానందం.. త‌మ జీవితంలోని అనుభ‌వాల‌తో 'నేను' రాశారు. అత్య‌ద్భుత‌మైన ఆయ‌న జీవిత ప్ర‌యాణాన్ని ఇందులో సంక్షిప్తం చేశారు. అక్క‌డ‌క్క‌డా చ‌మ‌త్కారంతో, మ‌న‌సులోని ఎన్నెన్నో విష‌యాల‌ను ఇందులో రాసుకున్నారు. ఓ వైపు జీవిత పాఠాల‌ను నేర్పుతూ, అనుభ‌వాల‌ను పంచుకుంటూ, అక్క‌డ‌క్క‌డా న‌వ్విస్తూ, ఎన్నో సినిమాల సంగ‌తుల‌ను గుర్తుచేస్తూ, ఆద్యంతం అద్భుతంగా సాగింది ఈ పుస్త‌కం. బ్ర‌హ్మానందంగారు రాసిన ఆటోబ‌యోగ్ర‌ఫీ 'నేను' అంద‌రికీ అందుబాటులో ఉంది. ప్ర‌తి ఒక్క‌రూ చ‌ద‌వ‌ద‌గ్గ పుస్త‌కం ఇది' అని చ‌ర‌ణ్‌ ట్వీట్ చేశారు.

తాజాగా హైదరాబాద్‌లో 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ మొదలైంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బ్రహ్మానందం కూడా ఓ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఆటోబయోగ్రఫీని చరణ్‌కు బహుకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా చాలారోజుల తర్వాత బ్రహ్మీ-చరణ్ షూటింగ్‌లో పాల్గొనడం, సరికొత్త లుక్‌లో కనిపించారు.

(ఇదీ చదవండి: అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement