
ప్రముఖ నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. సుబ్బు చెరుకూరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బుధవారం (మార్చి 2) గౌతమ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ‘ఒంటరితనం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా’ అనే డైలాగ్‌తో గౌతమ్ లుక్ రివీల్ చేశారు. ‘‘ఈ చిత్రంలో గౌతమ్ మోనోఫోబియాతో బాధపడుతున్న రచయిత పాత్రలో కనిపిస్తాడు. ఒక ప్రమాదం అతని జీవితాన్ని ఎలా మార్చింది? అతను ఎదుర్కొంటున్న సమస్య మరో పెద్ద సమస్యకు కారణం అయితే దాన్ని ఎలా అధిగమించాడు? అనేది థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ప్రస్తుతం మా సినిమా షూటింగ్ చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది’’ అని చిత్రయూనిట్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment