Comedian Sudhakar Shocking Look in Zee Telugu Promo - Sakshi
Sakshi News home page

Comedian Sudhakar: గుర్తుపట్టలేనంతగా మారిన కమెడియన్ సుధాకర్

Published Sat, Jun 17 2023 5:04 PM | Last Updated on Sat, Jun 17 2023 6:07 PM

Comedian Sudhakar Shocking Look Zee Telugu Promo - Sakshi

వేరే ఏ ఇండస్ట్రీకి లేని చాలా ప్లస్ పాయింట్స్ లో టాలీవుడ్ లో ఉన్నాయి. ప్రస్తుతానికి లెక్కకి మించిన పాన్ ఇండియా మూవీస్.. మన దర్శకులే తీస్తున్నారు. ఇప్పుడంటే తగ్గిపోయారు గానీ వేరే ఏ ఇండస్ట్రీలోనూ లేనంత మంది కమెడియన్స్ తెలుగులోనే ఉన్నారు. అలా ఓ ఫేడౌట్ అయిన హాస్యనటుడు చాలారోజుల తర్వాత ఓ రియాలిటీ షోలు సందడి చేశారు. ఫ్యాన్స్ ఆయన్ని చూసి హ‍్యాపీగా ఫీలవుతున్నారు.

ఇప్పటి జనరేషన్ కు సుధాకర్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ 15-20 ఏళ్ల ముందు మూవీస్ చూసిన వాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. కమెడియన్ గా మనల్ని తెగ నవ్వించిన ఆయన గత కొన్నేళ్లలో బయట ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య కొన్నిరోజుల ముందు సుధాకర్ చనిపోయారనే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. వాటిని కొట‍్టిపారేస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: హీరోయిన్ హనీరోజ్ సాహసం.. అలాంటి ప్లేసులో ముద్దు!)

తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఓ ప‍్రముఖ ఛానెల్ లో ఫాదర్స్ డే సందర్భంగా 'నేను నాన్న' పేరుతో ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. సుధాకర్ ని ఈషోకి తీసుకొచ్చిన ఆర్గనైజర్స్.. నటుడిగా 45 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నందుకు గానూ సన్మానించారు. ఆయనతో కేక్ కూడా కట్ చేయించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అయింది. 

ఈ ప్రోమోలో కమెడియన్ సుధాకర్ ని చూసి చాలామంది ఫస్ట్ గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత ఆయన చేసిన మూవీస్, నవ్వించిన సీన్స్ ని గుర్తుచేసుకుని మరీ సంతోషంగా ఫీలయ్యారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం సరిగా లేదు. దీంతో సన్నగా మారిపోయి, మరీ గుర్తుపట్టలేనంతగా ఉన్నారు. ఏదైతేనేం ఆయన ఇలా షోకి రావడం, అందరితో కలిసి ఎంజాయ్ చేయడం మాత్రం కనువిందుగా అనిపించింది.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement