ప్ర‌వీణ్‌తో బ్రేక‌ప్‌.. తొలిసారి స్పందించిన ఫైమా | Patas Faima First Time Opened Up About Breakup Rumours With Praveen, Deets Inside | Sakshi
Sakshi News home page

Faima On Breakup With Praveen: ప్ర‌వీణ్‌తో బ్రేక‌ప్‌? త‌న సింప‌థీ వ‌ల్ల నేను నెగెటివ్ అవుతున్నా!

Published Mon, May 6 2024 12:22 PM | Last Updated on Mon, May 6 2024 12:57 PM

Patas Faima About Breakup Rumours with Praveen

వ్య‌క్తిగ‌త విష‌యాల వ‌ల్ల మేము దూర‌మ‌య్యాం. అలాంట‌ప్పుడు ప‌ర్స‌న‌ల్‌గా నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మాట్లాడాలి.

తెలుగు బుల్లితెర షోల‌లో ఒక‌ప్పుడు మేల్ క‌మెడియ‌న్ల‌దే ఆధిప‌త్యం ఉండేది. రానురానూ ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది. లేడీస్ తాము కూడా కామెడీ పండించ‌‌గ‌ల‌మ‌ని నిరూపించుకున్నారు. కామెడీ క్వీన్స్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అలా ప‌టాస్‌, జ‌బ‌ర్ద‌స్త్ షోల‌లో ఫ‌టాఫ‌ట్ పంచ్‌లు పేలుస్తూ అంద‌రికీ ద‌గ్గ‌రైంది ఫైమా. 

ప్ర‌వీణ్‌తో ల‌వ్‌!
అదే షోలోని మ‌రో క‌మెడియ‌న్ ప్ర‌వీణ్‌తో ఫైమా ప్రేమాయ‌ణం న‌డుపుతుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. వీరిద్ద‌రూ క‌లిసి రీల్స్ చేయ‌డం, గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవ‌డం చూసి ఇదంతా నిజ‌మే అని జ‌నాలు ఫిక్స‌యిపోయారు. కానీ అంత‌లోనే బ్రేక‌ప్ జ‌రిగిందంటూ రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఆ మ‌ధ్య ప్ర‌వీణ్ త‌న ప్రేమ‌ను ఫైమా రిజెక్ట్ చేసింద‌ని వెల్ల‌డించాడు. 

ఆ ఫేమ్ వాడుకున్నాం
తాజా ఇంట‌ర్వ్యూలో ఫైమా ఈ విష‌యం గురించి మాట్లాడింది. 'టీవీ షోల‌లో క‌నిపించే జోడీలేవీ నిజం కాదు. అవి నిజ‌మ‌ని న‌మ్మొద్దు. ప్ర‌వీణ్‌, న‌న్ను ఆన్‌స్క్రీన్‌లో జోడీగా చూపించారు. మా జంట‌ను ఆద‌రించారు. దాన్ని వాడుకుంటూ యూట్యూబ్‌లో వీడియోలు చేశాం. ప్ర‌వీణ్‌కు, నాకు మ‌ధ్య కొన్ని వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లున్నాయి. అవి చెప్పుకోలేం.. అందుకే దూరం కావాల్సి వ‌చ్చింది. మాట్లాడుకోవ‌ట్లేదు కూడా!

వ్య‌క్తిగ‌త విష‌యాల వ‌ల్లే
మాకు గొడ‌వ జ‌రిగిన‌ప్పుడు దాన్ని ప‌క్క‌న‌పెట్టేయాలే త‌ప్ప‌ దాన్ని అంద‌రి ముందూ చెప్పుకుని గొడ‌వ‌ను పెద్ద‌ది చెయ్య‌డం నాకిష్టం లేదు. అంత‌కుముందు మా రిలేష‌న్, అండ‌ర్‌స్టాండింగ్ అంతా బాగుండేది. వ్య‌క్తిగ‌త విష‌యాల వ‌ల్ల మేము దూర‌మ‌య్యాం. అలాంట‌ప్పుడు ప‌ర్స‌న‌ల్‌గా నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మాట్లాడాలి. 

సింప‌థీ
కానీ త‌న‌కు పేరెంట్స్ లేక‌పోవ‌డంతో అత‌డు మీడియా ముందు మాట్లాడే మాట‌లు సింప‌థీకి దారి తీస్తున్నాయి. త‌న మీద నేను నింద వేయ‌డం లేదు. కానీ త‌న మీద సింప‌థీతో అత‌డు ఏం చెప్పినా జ‌నాలు న‌న్ను నెగెటివ్ చేస్తున్నారు. ద‌య‌చేసి మా రిలేష‌న్‌కు ఏ పేరూ పెట్టకండి' అని ఫైమా చెప్పుకొచ్చింది.

చ‌ద‌వండి: ఒక్క పొర‌పాటుతో జాత‌క‌మే మారిపోయింది! అస‌లు పేరేంటంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement