కథానాయకులుగా అవతారమెత్తిన హాస్యనటుల సరసన ఇప్పుడు నటుడు పుగళ్ చేరారు. కుక్ విత్ కోమాలి బుల్లితెర కార్యక్రమంతో పాపులర్ అయిన ఈయన ఆ తరువాత సినీ రంగప్రవేశం చేసి హాస్యనటుడిగా అనతి కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు తుడిక్కరదు మీసై చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. యోగి వీరన్ పిక్చర్ పతాకంపై రాము నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎంజే ఇళన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఎస్‌డీ సభ వద్ద పలు చిత్రాలకు సహాయదర్శకుడిగా పనిచేశారు.
తుడిక్కరదు మీసై చిత్ర యూనిట్
అదేవిధంగా నిర్మాత కలైపులి.ఎస్.థాను వద్ద పనిచేసి అనుభవం గడించారు. తుడిక్కరదు మీసై చిత్రం గురువారం చైన్నెలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ప్రేమించడం తప్పు కాదు, ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకునే ఈతరం యువత గురించి చెప్పే కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రాన్ని వినోదాన్ని జోడించి జనరంజకంగా రూపొందిస్తున్నట్లు చెప్పారు. చిత్ర కథ మదురై నుంచి చైన్నె వరకూ సాగుతుందని చెప్పారు. సినిమాపై ఆసక్తి, ప్రతిభ కలిగిన యూనిట్‌తో షూటింగ్‌కు సిద్ధమైనట్లు చెప్పారు. కాగా దీనికి అశోక్‌కుమార్ ఛాయాగ్రహణం, శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment