హీరోగా మారిన కమెడియన్‌, నిజమైన పులితో యాక్టింగ్‌ | Mr Zoo Keeper Movie: Pugazh Says He Acted With Real Tiger | Sakshi
Sakshi News home page

హీరోగా మారిన మరో కమెడియన్‌, నిజమైన పులితో నటించానంటూ..

Published Fri, Feb 9 2024 12:24 PM | Last Updated on Fri, Feb 9 2024 1:16 PM

Mr Zoo keeper Movie: Pugazh Says He Acted With Real Tiger - Sakshi

హాస్యనటులు కథానాయకులుగా మారడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కోలీవుడ్‌లో వడివేలు, సంతానం, సూరి.. హాస్యనటులు కథానాయకులుగా అవతారమెత్తి రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ వరుసలో ఇప్పుడు నటుడు పుగళ్‌ చేరారు. 4 జే స్టూడియోస్‌ పతాకంపై ఎస్‌.రాజతంత్రం, జబాజాన్‌ కలిసి నిర్మించిన చిత్రం మిస్టర్‌ జూ కీపర్‌. పుగళ్‌ హీరోగా నటించిన ఇందులో నటి షెర్లిన్‌ కాంచాలా హీరోయిన్‌గా నటించారు. జె.సురేష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించారు.

కథ చెప్పి మాయమయ్యాడు
ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు సూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుగళ్‌ మాట్లాడుతూ.. ముందుగా దర్శకుడు తనను కలిసి కథ చెప్పి ఆ తరువాత కనిపించలేదన్నారు. కొంత కాలం తరువాత మళ్లీ కనిపించి వెంటనే షూటింగ్‌కు బయలుదేరండి అని చెప్పారన్నారు. అలా ఈ మూవీలో అవకాశం వరించిందన్నారు.

పులిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించా
ఈ మూవీలో నిజమైన పులితో నటించడం ముందు భయంగా అనిపించిందన్నారు. ఆ తరువాత దాన్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించానన్నారు. అలా ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. సూరి మాట్లాడుతూ హీరోగా గెలవడం కంటే నిలబడడం కష్టమన్నారు. పుగళ్‌లో మంచి నటుడు ఉన్నాడని, హీరోగా వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని సూరి అన్నారు.

చదవండి: 'వ్యూహం' విడుదల తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement