చిత్రం సినిమాతో పేరు తెచ్చుకున్న కమెడియన్ బబ్లూ ఆర్య సినిమాతో అందరికీ దగ్గరయ్యాడు. తెలుగులో స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించిన అతడు తన కామెడీ టైమింగ్‌తో ఎందరినో నవ్వించాడు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అతడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.
5 ఏళ్లకే సినిమాల్లోకి..
'నా మొదటి చిత్రం ముద్దుల మేనల్లుడు. అప్పుడు నా వయసు 5 ఏళ్లు. అందులో నాజర్ కొడుకిగా నటించాను. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశాను. 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సీరియల్ చేశాను. నా అసలు పేరు సదా ఆనంద్. ఈ సీరియల్ చేసేటప్పుడు జంధ్యాలగారు బబ్లూ అన్న పేరు పెట్టారు. అప్పటినుంచి అదే పేరు స్థిరపడిపోయింది. నేను 10వ తరగతి చదివేటప్పుడు చిత్రం మూవీ చేశాను. ఆ సినిమాతో బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. మా నాన్న బాడీ బిల్డర్. ఆయన సినిమాలు చేయాలని ఎంతో ప్రయత్నించాడు, కానీ కుదర్లేదు. అయితే 'చిత్రం'లో నాతోపాటు ఓ సాంగ్‌లో నటించాడు.
నాకిష్టమైన ముగ్గురూ చనిపోయారు
2012లో నాన్న చనిపోయాడు. గతేడాది చెల్లి మరణించింది. ఈ ఏడాది జనవరిలో నాన్న సోదరి కొడుకు చనిపోయాడు. అలా నాకు ఇష్టమైన ముగ్గురు చనిపోయారు. మా నాన్న మరణంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అప్పుడు ఆఫర్స్ వదిలేసుకున్నాను. బ్యాంకాక్ వెళ్లిపోయి రెండేళ్లకుపైగా అక్కడే ఉన్నాను. అలా సినిమాలకు దూరమయ్యాను. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టాను. ప్రస్తుతం సొంతంగా ఓ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. అలాగే యాక్టింగ్ అకాడమీలోనూ పని చేస్తున్నాను.
పెళ్లి వాయిదా
పెళ్లి విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌లో ఆ అమ్మాయిని ప్రేమించాను. మూడేళ్లుగా లవ్ చేసుకున్నాం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. నిజానికి ఈ ఏడాదే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ చెల్లి మరణంతో అది వాయిదా పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నా పెళ్లి జరుగుతుంది' అని చెప్పుకొచ్చాడు బబ్లూ.
Comments
Please login to add a commentAdd a comment