క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా దాదాపు వంద సినిమాల్లో నటించాడు కమెడియన్ రామచంద్ర. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆయన ఆ మధ్యలో కొంతకాలం వెండితెరపై పెద్దగా కనిపించలేదు. తాజాగా తను సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి గల కారణాన్ని తెలియజేస్తూ జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.
అదే నా మొదటి పారితోషికం..
'2016లో ఓ చిన్న సినిమాలో కిందపడిపోతే నా కాలు ఫ్రాక్చర్ అయింది. కోలుకోవడానికి మూడేళ్లు పట్టింది. ఆ తర్వాత కోవిడ్ వల్ల మరో రెండేళ్లు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అలా అనుకోకుండా గ్యాప్ వచ్చింది. సినిమాల్లోకి రావాలని నాకు చిన్నప్పటి నుంచే ఆశగా ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నిన్ను చూడాలని సినిమా ఆడిషన్‌కు వెళ్లగా వెంటనే నన్ను ఓకే చేశారు. ఇది నా తొలి సినిమా, రూ.11,000 పారితోషికం అందుకున్నాను.
జబర్దస్త్‌కు ట్రై చేశా కానీ..
తర్వాత ఆనందం సినిమా చేశాను. ఈ సినిమాలు క్లిక్ అవ్వడంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాను. బాధపడ్డ సందర్భాలు ఏంటంటే.. పరుగు సినిమా ఆడిషన్స్‌లో రిజెక్ట్ చేశారు. ఖలేజాలో నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత సీన్స్ తీసేశారు. సర్కారువారి పాట, గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా సినిమాల్లోనూ ఎడిటింగ్‌లో నా సీన్స్ తీసేశారు. జబర్దస్త్ ప్రారంభమైన తొలినాళ్లలో ఆ కామెడీ షోలో ప్రయత్నించా కానీ తీసుకోలేదు.
సంపాదించినదంతా పోగొట్టుకున్నా
ఓసారి గెస్ట్ ఎపిసోడ్‌కు చలాకీ చంటి నన్ను షోకి పిలిస్తే వెళ్లాను. అతడికి ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదు. వెళ్లి కలవాలి. నేను మోసపోయిన సందర్భం ఒకటుంది. కొందరిని నమ్మి ఓ బిజినెస్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. ఆ డబ్బులు తిరిగి రావడం కాదు కదా మరింత కట్టాల్సి వచ్చింది. అలా దాదాపు రూ.60 లక్షలు పోగొట్టుకున్నాను. అదే సమయంలో నా కాలు ఫ్రాక్చర్ కావడంతో వైద్యానికి బాగా ఖర్చయింది. సంపాదించినంతా పోయింది. ఆ తర్వాత అమ్మ చనిపోయింది. ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలింది. వాటి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది' అన్నాడు రామచంద్ర.
Comments
Please login to add a commentAdd a comment