Ramachandram
-
కొందరిని నమ్మి రూ.60 లక్షలు పోగొట్టుకున్నా: కమెడియన్
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా దాదాపు వంద సినిమాల్లో నటించాడు కమెడియన్ రామచంద్ర. తన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఆయన ఆ మధ్యలో కొంతకాలం వెండితెరపై పెద్దగా కనిపించలేదు. తాజాగా తను సినిమాలకు గ్యాప్ ఇవ్వడానికి గల కారణాన్ని తెలియజేస్తూ జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అదే నా మొదటి పారితోషికం.. '2016లో ఓ చిన్న సినిమాలో కిందపడిపోతే నా కాలు ఫ్రాక్చర్ అయింది. కోలుకోవడానికి మూడేళ్లు పట్టింది. ఆ తర్వాత కోవిడ్ వల్ల మరో రెండేళ్లు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. అలా అనుకోకుండా గ్యాప్ వచ్చింది. సినిమాల్లోకి రావాలని నాకు చిన్నప్పటి నుంచే ఆశగా ఉండేది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన నిన్ను చూడాలని సినిమా ఆడిషన్‌కు వెళ్లగా వెంటనే నన్ను ఓకే చేశారు. ఇది నా తొలి సినిమా, రూ.11,000 పారితోషికం అందుకున్నాను. జబర్దస్త్‌కు ట్రై చేశా కానీ.. తర్వాత ఆనందం సినిమా చేశాను. ఈ సినిమాలు క్లిక్ అవ్వడంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాను. బాధపడ్డ సందర్భాలు ఏంటంటే.. పరుగు సినిమా ఆడిషన్స్‌లో రిజెక్ట్ చేశారు. ఖలేజాలో నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత సీన్స్ తీసేశారు. సర్కారువారి పాట, గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా సినిమాల్లోనూ ఎడిటింగ్‌లో నా సీన్స్ తీసేశారు. జబర్దస్త్ ప్రారంభమైన తొలినాళ్లలో ఆ కామెడీ షోలో ప్రయత్నించా కానీ తీసుకోలేదు. సంపాదించినదంతా పోగొట్టుకున్నా ఓసారి గెస్ట్ ఎపిసోడ్‌కు చలాకీ చంటి నన్ను షోకి పిలిస్తే వెళ్లాను. అతడికి ఈ మధ్య ఆరోగ్యం బాగోలేదు. వెళ్లి కలవాలి. నేను మోసపోయిన సందర్భం ఒకటుంది. కొందరిని నమ్మి ఓ బిజినెస్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను. ఆ డబ్బులు తిరిగి రావడం కాదు కదా మరింత కట్టాల్సి వచ్చింది. అలా దాదాపు రూ.60 లక్షలు పోగొట్టుకున్నాను. అదే సమయంలో నా కాలు ఫ్రాక్చర్ కావడంతో వైద్యానికి బాగా ఖర్చయింది. సంపాదించినంతా పోయింది. ఆ తర్వాత అమ్మ చనిపోయింది. ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలింది. వాటి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది' అన్నాడు రామచంద్ర. చదవండి: గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటున్న హీరోయిన్ -
ఉస్మానియాను ‘ఆన్లైన్’ చేశా
ఉస్మానియాయూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తొలి వీసీగా పనిచేయడం తన అదృష్టమని, వందేళ్ల ఓయూకు శతాబ్ది ఉత్సవాలు తన చేతుల మీదుగా నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రం ఆనందం వ్యక్తం చేశారు. అన్ని విభాగాల్లోనూ ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టి అక్రమాలకు చోటు లేకుండా ఓయూను తీర్చిదిద్దానన్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ రామచంద్రం 2017 జూలై 24న ఓయూ వీసీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. బుధవారంతో ఆయన పదవీ కాలం పూర్తయింది. ఈ సందర్భంగా వీసీగా తన మూడేళ్ల పాలనా అనుభవాలను బుధవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. సమయ పాలనతో తొలి అడుగు వర్సిటీ అభివృద్ధిలో వీసీ ప్రొఫెసర్ రామచంద్రం సమయ పాలన పాటించారు. అది తన నుంచే మొదలు పెట్టారు. తన నివాసాన్ని ఆర్టీసీ క్రాస్‌రోడ్డు అశోక్‌నగర్ నుంచి ఓయూ క్యాంపస్‌కు మార్చారు. వీసీగా బాధ్యతలు నిర్వహిస్తునే ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులకు క్రమం తప్పకుండా తరగతులను తీసుకున్నారు. భార్య ఇందిర బ్యాంక్ మేనేజర్, ఒకే కొడుగు అమెరికాలో స్థిరపడ్డారు. తనకు కుటుంబ బాధ్యతలు పెద్దగా లేకపోవడంతో నిత్యం వర్సిటీ కోసమే పనిచేసిన్నట్లు వివరించారు. రామచంద్రం కంటే ముందు ఓయూకు రెండేళ్ల పాటు శాస్వత వీసీ లేనందున తను పదవీ బాధ్యతలు చేపట్టేనాటికి అనేక సమస్యలతో ఉద్యోగుల ఆందోళనలు నిత్యం జరుగుతుండేవని, వీటితో పాటు నిధుల కొరతతో ఓయూ కొట్టుమిట్టాడుతుండేది. ఆరు నెలల్లోనే ఆందోళనలకు తావులేకుండా అభివృద్ధిపై దృష్టి సారించానన్నారు. అందరి సహకారంతో మూడేళ్లలో శతాబ్ది ఉత్సవాల నిర్వహణ, ఏడేళ్లకు ‘న్యాక్ ఎ ప్లస్’ గ్రేడ్ గుర్తింపు, రూసా పథకం ద్వారా రూ.100 కోట్లు, ఏడు పరిశోధన కేంద్రాల స్థాపన, ఆరేళ్ల స్నాతకోత్సవాన్ని ఒకేసారి నిర్వహించానన్నారు. ఓయూలో ఎన్నో అభివృద్ధి పనులు ఓయూలో చదివే విద్యార్థుల సౌకర్యార్థం అనేక అభివృద్ధి పనులు చేపట్టిన్నట్లు వీసీ రామచంద్రం వివరించారు. హాస్టల్ భవనాల నిర్మాణంతో పాటు కార్యాలయాలు, ఇతర భవనాలను నిర్మించిన్నట్లు చెప్పారు. క్యాంపస్‌లో రోడ్ల నిర్మాణం, తాగునీటి వసతి, ఉచిత వైఫై, వికలాంగ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, పరీక్ష ఫీజు మొదలు హాస్టల్ మెస్ బిల్లుల వరకు ఆన్లైన్లో చెల్లిపును ప్రవేశ పెట్టామన్నారు. అన్ని ప్రవేశ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించి జవాబు పత్రాల మూల్యాంకనం సైతం ఆన్లైన్లో చేస్తున్నట్టు చెప్పారు. పరీక్షల విభాగంలో వివిధ డిగ్రీ కోర్సుల సర్టిఫికెట్లను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికి పంపే ఏర్పాట్లు చేశామన్నారు. పీజీ ప్రవేశాలు, హాస్టల్స్ ప్రవేశాలను ఆన్లైన్ చేసినట్టు వివరించారు. ఓయూ పూర్వ విద్యార్థుల సమాఖ్య మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు హయాంలో అంకురించిన ఓయూ పూర్వ విద్యార్థుల సమాఖ్యను ప్రొఫెసర్ రామచంద్రం బలోపేతం చేశారు. పూర్వ విద్యార్థుల ఆహ్వానం మేరకు అమెరికాలో పర్యటించి ఓయూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. దాంతో అక్కడి వారు రూ.20 కోట్ల నిధులతో ఓయూలో భవన నిర్మాణాలు చేపట్టారు. మరిన్ని నిధుల కోసం ఎండోమెంట్ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఉద్యోగులకు పదోన్నతులు తన హాయంలో అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్ స్కీమ్ (సీఏఎస్) కింద రెండుసార్లు పదోన్నతులు కల్పించిన్నట్లు వీసీ వివరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోషియేట్‌గా, అసోషియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులు కల్పించిన్నట్లు తెలిపారు. వందలాది మంది బోధనేతర ఉద్యోగులకు కూడా పదోన్నతులిచ్చి వారి మెప్పు పొందారు. 60 మందిని కారుణ్య నియామకాల ద్వారా కొలువులిచ్చినట్టు చెప్పారు. వీసీ పదవీ కోసం మళ్లీ దరఖాస్తు ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్ రామచంద్రం వీసీ పదవీ కోసం మరోసారి దరఖాస్తు చేశారు. తొలిసారి తను దరఖాస్తు చేసినప్పుడు తనను ఓయూకు వీసీగా నియస్తారని అనుకోలేదని కానీ తన బయోడాటా చూసిన సీఎం కేసీఆర్.. వందేళ్ల వర్సిటీకి వీసీగా నియమించారన్నారు. తన మూడేళ్ల పదవీ కాలాన్ని విజయవంతంగా ముగించుకున్న ఆయన్ను బుధవారం పాలన భవనం ఉద్యోగులు, అధ్యాపకులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఏటా అధ్యాపకులు ఉద్యోగ విరమణ చేయడంతో 1260 శాస్వత అధ్యాపక ఉద్యోగాలకు ఇప్పుడు 465 మంది మాత్రమే ఉన్నారు. నా హయాంలో 415 అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం అనుమతిచ్చి్చంది. వాటి భర్తీకి కొన్ని అడ్డంకులు ఉన్నందున ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఉద్యోగాలను భర్తీ చేయక పోవడం నా పాలనలో వెలితిగాకనిపిస్తోంది. -
బీఎస్ఎన్ఎల్ సిమ్‌తో మొబైల్ ఫోన్లు
పీజీఎం రాంచంద్రం వెల్లడి సాక్షి, హైదరాబాద్: త్వరలో బీఎస్ఎన్ఎల్(సిమ్) కనెక్షన్‌తో కూడిన మైక్రోమ్యాక్స్, లావా ఫోన్లు అందు బాటులో రానున్నట్లు హైదరాబాద్ టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాంచంద్రం వెల్లడించారు. గురువారం బీఎస్ఎన్ఎల్ భవన్లో ఆయన విలేక రులతో మాట్లాడారు. ఇప్పటికే రెండు సంస్థలతో ఒప్పందం కుదిరినప్ప టికీ ధర ఇంకా నిర్ణయించలేదని తెలిపారు. వైఫై సేవలు మరింత విస్తరించేందుకు 118 గ్రామీణ వైఫై ఎక్సే్చంజ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది 4జీ సేవలను అందు బాటులో తెచ్చేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. 2018, ఫిబ్రవరి 6వ తేదీ లోగా మొబైల్ నంబర్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా చేయిం చాలని సూచించారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఉచిత కాల్స్, డేటా రోమింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్లాన్–429కు లభిస్తున్న ఆదరణతో రోజుకు మూడు వేలకు పైగా కొత్త కనెక్షన్లు వస్తున్నా యని ఆయన పేర్కొ న్నారు. 180 రోజుల కాలపరిమితి గల ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు అన్ లిమిటెడ్ కాల్స్, ప్రతిరోజు ఒక జీబీ డేటా, 90 రోజుల అనంతరం ప్రతి 1 జీబీకి మూడు పైసలు చార్జీలు ఉంటాయని వివరిం చారు. ప్లాన్ 666లో 90 రోజుల కాలపరిమితి, అన్ని నెట్‌వర్క్‌లకు 2 జీబీ డాటా, 90 రోజులు దాటిన తర్వాత ప్రతి 2 జీబీకి మూడు పైసల చార్జీలు ఉంటాయని ఆయన చెప్పారు. విజయ, లక్ష్మి టాపప్ ఆఫర్‌పై 50 శాతం అదనంగా టాక్‌టైమ్ వర్తిస్తుందని తెలిపారు. విలేకరుల సమావేశంలో టెలికం అధికారులు సత్యానందం, హనుమంతరావు, శ్రీనివాస్, రవిచంద్ర, సుజాత, శేషాచలం, రాజహంస తదితరులు పాల్గొన్నారు. -
నర్సరీ ముందే కుప్పకూలిపోయాడు
మనోవేదనతో ఓ నర్సరీ యజమాని గుండెపోటుకు గురై మృతి చెందాడు. చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రామచంద్రం (50) నర్సరీ నిర్వహణతో జీవనం సాగిస్తున్నాడు. నర్సరీ ఏర్పాటు కోసం రూ.15 లక్షల అప్పులు చేశాడు. ఇటీవలి భారీ వర్షాలతో నర్సరీలోని పైరుకు తెగుళ్లు సోకి రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదన చెందుతున్న అతడు ఆదివారం సాయంత్రం నర్సరీ ముందే కుప్పకూలి మృతి చెందాడు.