మనోవేదనతో ఓ నర్సరీ యజమాని గుండెపోటుకు గురై మృతి చెందాడు.
మనోవేదనతో ఓ నర్సరీ యజమాని గుండెపోటుకు గురై మృతి చెందాడు. చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. రామచంద్రం (50) నర్సరీ నిర్వహణతో జీవనం సాగిస్తున్నాడు. నర్సరీ ఏర్పాటు కోసం రూ.15 లక్షల అప్పులు చేశాడు. ఇటీవలి భారీ వర్షాలతో నర్సరీలోని పైరుకు తెగుళ్లు సోకి రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదన చెందుతున్న అతడు ఆదివారం సాయంత్రం నర్సరీ ముందే కుప్పకూలి మృతి చెందాడు.