Actor Dhanraj Gets Emotional In Show - Sakshi
Sakshi News home page

Dhanraj: చిన్నపిల్లాడిలా ఏడ్చేసిన ధనరాజ్‌.. ఈ ప్రపంచంలో నాకు రక్తసంబంధం అనేదే లేదంటూ..

Aug 5 2023 10:53 AM | Updated on Aug 5 2023 11:18 AM

Dhanraj Gets Emotional in Show - Sakshi

మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలీదు. ప్రపంచంలో నాకు రక్తసంబంధం అనేదే లేదు. ఏదైనా రక్తసంబంధం ఉందీ ఉంటే అది వీళ్లిద్దరితోనే స్టార్ట్‌ అయింది అంటూ పిల్లలను చూపిస్తూ ఏడ్చేశాడు. దీంతో ధనరాజ్‌ భార్య సైతం కంటతడి పెట్టుకుంది. ధనరాజ్‌ తనయుడు మాట్లాడుతూ.. డాడీ, తమ్ముడు, మమ్మీ.. వీళ్లే నా ప్రపంచం అంటూ భావో

జబర్దస్త్‌ షోలో నవ్వులు పూయించిన కమెడియన్లలో ధనరాజ్‌ ఒకరు. ఇతడి పంచులు, డైలాగ్‌ డెలివరీ విధానానికి జనాలు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునేవాళ్లు. ఈ షోతో కమెడియన్‌గా తనను తాను నిరూపించుకున్న ఇతడు అప్పటికే వెండితెరపైనా తళుక్కుమని మెరిశాడు. జై సినిమాతో సినీప్రపంచంలో అడుగుపెట్టిన అతడు పరుగు, గోపి గోపిక గోదావరి, పిల్ల జమీందార్‌ వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అతడి యాక్టింగ్‌ ఎంతో సహజంగా ఉండటంతో బోలెడన్ని సినిమా అవకాశాలు ఆయన ఇంటి తలుపు తట్టాయి. దీంతో వచ్చినవాటినల్లా చేసుకుంటూ పోయాడు.

మధ్యలో జబర్దస్త్‌లో టీమ్‌ లీడర్‌గానూ చేశాడు. ఈ మధ్య ఎక్కువగా చిన్న చిత్రాల్లోనే కనిపిస్తున్నాడు ధనరాజ్‌. తాజాగా అతడు ఓ షోలో కంటతడి పెట్టుకున్నాడు. 'మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలీదు. ప్రపంచంలో నాకు రక్తసంబంధం అనేదే లేదు. ఏదైనా రక్తసంబంధం ఉందీ ఉంటే అది వీళ్లిద్దరితోనే స్టార్ట్‌ అయింది' అంటూ పిల్లలను చూపిస్తూ ఏడ్చేశాడు. దీంతో ధనరాజ్‌ భార్య సైతం కంటతడి పెట్టుకుంది. ధనరాజ్‌ తనయుడు సైతం.. 'డాడీ, తమ్ముడు, మమ్మీ.. వీళ్లే నా ప్రపంచం' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. వీరంతా ఓ ఫ్యామిలీ షోలో పాల్గొంటున్నారు.

ఇకపోతే ధనరాజ్‌ ఆమధ్య బిగ్‌బాస్‌ షోలోనూ కనిపించాడు. బిగ్‌బాస్‌ తెలుగు మొదటి సీజన్‌లో పాల్గొన్న అతడు టాప్‌ 10 కంటెస్టెంట్లలో ఒకరిగా చోటు దక్కించుకున్నాడు. దాదాపు నెలన్నర రోజులపాటు హౌస్‌లో కొనసాగాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు కామెడీ షోలు కూడా చేస్తున్నాడు.

చదవండి: తెలుగింటి హీరోయిన్‌..సీక్రెట్‌గా పెళ్లి.. మోసం చేసిన భర్త.. ఆర్థిక కష్టాలతో ఇల్లమ్మేసి..
పుట్టెడు శోకంలో ఉన్నాం.. మాపై మీరు చేస్తుంది అన్యాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement