
సహజ నటనకు మారు పేరు నటుడు అప్పుకుట్టి. వెన్నెలా కబడీ కుళు చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ఈయన పలు చిత్రాల్లో కామెడీ పాత్రల్లో నటించి సినిమాకు అందం, రంగు కంటే అభినయం ముఖ్యం అని నిరూపించారు. అలా అళగర్‌సామియిన్ కుదిరై చిత్రంతో కథానాయకుడిగా అవతారమెత్తారు. ఆ చిత్రంలో నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. ఇటీవల అవకాశాలు తగ్గినా.. శింబు హీరోగా నటించిన వెందు తనిందదుక్కాడు చిత్రంలో ముఖ్య భూమికను పోషించి లైమ్ టైమ్‌లోకి వచ్చారు.
రెండు సినిమాలు
ఇప్పుడు మళ్లీ కథానాయకుడిగా బిజీ అవుతున్నారు. ఈయన ప్రస్తుతం వాళ్గ వివసాయి, పిరందనాళ్ వాల్తుగళ్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. వీటిలో పాల్‌డిపో కదిరేశన్ నిర్మిస్తున్న చిత్రం వాళ్గ వివసాయి. పొన్ని మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వసుంధర హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో అప్పుకుట్టి రైతుగా నటిస్తున్నారని, ఈ చిత్రంలో ఆయన నటనకు మరోసారి జాతీయ అవార్డు అందుకుంటారనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది.
స్టార్ హీరోల సినిమాలో చేయాలనుంది
అప్పుకుట్టి మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నేను రైతు కుటుంబానికి చెందినవాడిని. అంతేకాదు, నేను కూడా రైతునే! పొలం దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం, నీళ్లు పెట్టడం.. అన్నీ తెలుసు. అవన్నీ చేసినవాడినే కాబట్టి ఈ పాత్ర పెద్ద కష్టంగా అనిపించలేదు. ఇలా హీరోగా నటించడం సంతోషంగా ఉంది. అయితే రజనీకాంత్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.
చదవండి: గట్టిగానే కొట్టిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' కలెక్షన్స్.. నేడు ఈ థియేటర్స్‌లోకి హీరో,హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment