కామెడీ పేరుతో అవమానించారు, ఇంత నిర్దయగా ప్రవర్తిస్తారా?: నటి | Kusha Kapila: Some Jokes in Pretty Good Roast Show Were Dehumanised Me | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకుంటే విలన్లుగా చూస్తారా? ఎందుకింత హేళన?: హాస్యనటి

Jul 22 2024 10:32 AM | Updated on Jul 22 2024 10:51 AM

Kusha Kapila: Some Jokes in Pretty Good Roast Show Were Dehumanised Me

కామెడీ పండించడం అంత ఈజీ కాదు. కానీ ఇది తనకు కొట్టిన పిండి అన్నట్లుగా అవలీలగా నవ్వులు పూయించగలదు కుశా కపిల. సోషల్‌ మీడియాతో స్టార్‌డమ్‌ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఘోస్ట్‌ స్టోరీస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో, ‘ప్లాన్‌ ఏ ప్లాన్‌ బి’, ‘సెల్ఫీ’, ‘థాంక్యూ ఫర్‌ కమింగ్‌’ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది. ఇటీవల ప్రెట్టీ గుడ్‌ రోస్ట్‌ షోలో పాల్గొంది.

అది నా తప్పే
అక్కడ స్టాండప్‌ కమెడియన్లు తన మీద కుళ్లు జోకులు వేయడాన్ని సహించలేకపోయింది. తన వ్యక్తిగత విషయాలైన విడాకుల గురించి కూడా సెటైర్లు వేయడాన్ని తట్టుకోలేకపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నా ఫ్రెండ్‌ ఒకరు చెప్పారని ఆ షోకి వెళ్లాను. నన్ను ఈరేంజ్‌లో రోస్ట్‌ చేస్తారనుకోలేదు. వాళ్లు ఏం ప్లాన్‌ చేశారనేది ముందుగానే అడిగి తెలుసుకోవాల్సింది. నా ఫ్రెండ్‌ మీద నమ్మకంతో నేనా పని చేయలేదు. అది నా తప్పే!

అందరి ముందు చులకనగా
అక్కడున్న ప్రేక్షకులు, సాంకేతిక నిపుణుల ముందు నన్ను చులకన చేసి మాట్లాడారు. నాపై వేసిన జోక్స్‌ కూడా నన్ను అవమానించేట్లుగా ఉన్నాయి. వీరికి మానవత్వమే లేదా అనిపించింది. కామెడీ పేరుతో ఒక మనిషిని ఇంత దారుణంగా హేళన చేయడం కరెక్ట్‌ కాదు. ఆ ఎపిసోడ్‌ ప్రసారం చేసేందుకు కూడా నా మనసు అంగీకరించలేదు. కానీ దాన్ని అడ్డుకుంటే నేను పిరికిదాన్నని ట్రోల్‌ చేసేవారు. అందుకే ఆ ఎపిసోడ్‌ ప్రసారం కానిచ్చాను.

అదే గమనించా
అయితే నా తర్వాత షూట్‌ చేసిన ఎపిసోడ్లలో మాత్రం వారు హద్దులు దాటలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో నోటికొచ్చిన జోక్స్‌ వేయలేదు. ఈ ఆరు నెలల్లో నేను గమనించిందేంటంటే విడాకులు తీసుకున్న మహిళలను ఏమైనా అంటారు. వారిని విలన్లలాగా చూస్తారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కుష కపిల లైఫ్‌ హిల్‌ గయి అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది.

చదవండి: నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement