అతడో కమెడియన్. జనాల్ని నవ్విస్తుంటాడు. స్టాండప్ షోలతో కితకితలు పెట్టిస్తుంటాడు. నెట్‌ఫ్లిక్స్‌లోనూ 'వేక్ న్ బేక్ బై రోహన్' అనే ప్రోగ్రాంతో క్రేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి ఇతడిని ఏడిపించారు. సరదాగా సినిమా చూద్దామని థియేటర్‌కి వెళ్తే చేదు అనుభవాలు మిగిల్చారు. ఆ విషయాల్ని స్వయంగా ఇతడే బయటపెట్టాడు. ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చాడు.
మల్టీప్లెక్స్‌ల్లో దోపిడి గురించి ప్రేక్షకులకు కొత్తగా చెప్పనక్కర్లేదు. సినిమా టికెట్ రేట్ కంటే స్నాక్స్, డ్రింక్స్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కమెడియన్ రోహన్ జోషి కూడా అలాంటి అనుభవమే ఎదుర‍్కొన‍్నాడు. ముంబయిలోని ఓ మల్టీప్లెక్స్‌కి రీసెంట్‌గా వెళ్లాడు. చిన్న పెప్సీకి రూ.400 ఛార్జ్ చేశారని, టేస్ట్ కూడా ఏం బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌లో కమల్‌హాసన్.. ఎక్కడో గుర్తుపట్టారా?)
రోహన్ జోషి ఇన్ స్టా పోస్ట్ ప్రకారం.. ఇతడు గతంలో ఓసారి 'షాంగ్ చీ' సినిమా త్రీడీలో చూద్దామని ఓ మల్టీప్లెక్స్‌కి వెళ్లాడు. అయితే మూవీని 2Dలో ప్లే చేశారు. ఇదేంటని స్టాఫ్‌ని అడిగితే ఇంటర్వెల్ తర్వాత పక్కా త్రీడీలో ప్లే చేస్తామని అన్నారట. మరోసారి 'టాప్‌గన్ మేవరిక్' చూద్దామని ఫ్రెండ్స్‌తో వెళ్తే సరిగా డైలాగ్స్ వినిపించలేదని, అడిగితే ముందు నుంచి ప్లే చేశారని చెప్పాడు. అయినా పెద్దగా మార్పులేం జరగలేదని అన్నాడు.
'గార్డియన్ ఆఫ్ ది గ్యాలక్సీ 3' చూడటం కోసం రోహన్, కొన్నిరోజుల ముందు ఓ మల్టీప్లెక్స్‌కి వెళ‍్లాడు. ఇంటర్వెల్ బ్రేక్ 15 నిమిషాల తర్వాత థియేటర్‌లోకి వెళ్లాడు. సినిమా చూసి వచ్చేశాడు. మరోసారి అదే మూవీ చూసిన తర్వాత ఈ కమెడియన్‌కి అర్థమైన విషయం ఏంటంటే.. గతసారి ఇంటర్వెల్ బ్రేక్‌లోనూ మూవీ రన్ చేశారు. దీంతో పావు గంట పార్ట్‌ని అందరూ మిస్ అయిపోయారట. ఇవన్నీ బయటపెట్టిన ఇతడు.. మల్టీప్లెక్స్‌ల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.
(ఇదీ చదవండి: Hatya Review: ‘హత్య’ మూవీ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment