పెళ్లైన 13 రోజులకే కొట్టాడు, మరో అమ్మాయితో ఎఫైర్‌.. ఆత్మహత్య: నటి | Tragic Life Story Of Tollywood Comedian Vijay Sai, Know About His Marriage, Divorce And Suicide - Sakshi
Sakshi News home page

Comedian Vijay Sai Sad Life Story: భార్య ఉండగా మరొకరితో ఎఫైర్‌, ఆస్తి కోసం టార్చర్‌.. చివరకు ఆత్మహత్య చేసుకుని..

Published Wed, Oct 11 2023 5:07 PM | Last Updated on Wed, Oct 11 2023 5:42 PM

Tragic Life Story Of Tollywood Comedian Vijay Sai, Know About His Marriage, Divorce And Suicide - Sakshi

విజయ్‌సాయి.. అమాయకపు చూపులతో అందరినీ నవ్వించాడు. హీరోగా, హీరో ఫ్రెండుగా, కమెడియన్‌గా.. భిన్న రకాల పాత్రలు పోషించి సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ అయ్యాడు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 2006లో నటి వనితా రెడ్డిని పెళ్లి చేసుకోగా ఓ పాప కూడా పుట్టింది. కానీ, కొంతకాలానికే విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. 2015లో ఇద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. 2017లో తన గదిలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. తన చావుకు వనితాయే కారణమంటూ సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

పారిపోయి పెళ్లి చేసుకున్నాం..
ఇకపోతే ఇటీవల వనితా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమవివాహం- విడాకుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'వాల్‌పోస్టర్‌ మూవీ షూటింగ్‌లో విజయ్‌కు జంటగా నటించాను. ఆ సినిమా షూటింగ్‌లోనే క్లోజయ్యాం. ఇద్దరం ప్రేమించుకున్నాం. రైల్లో ఉన్నప్పుడే నాకు రింగు తొడిగాడు. ఇంట్లో మా ప్రేమను ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీశైలం వెళ్లగా అక్కడ కారులోనే నాకు పసుపుతాడు కట్టేశాడు. నేను ఆ పసుపుతాడు ఎవరికీ కనబడకుండా జాగ్రత్తపడేదాన్ని. ఒకానొక సమయంలో మా అమ్మకు దొరికిపోయాను. దీంతో తను రోడ్డుపైనే నా తాళి తెంపేసి రచ్చ చేసింది.

పెళ్లైన 13 రోజులకే కొట్టడం మొదలుపెట్టాడు
ఇంతదాకా వచ్చాక చేసేదేముందని ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తీసుకుని పారిపోయి విజయ్‌ దగ్గరకు వచ్చేశాను. అప్పుడు యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాం. కానీ తన నిజ స్వరూపం నెమ్మదిగా తెలిసి వచ్చింది. పెళ్లైన 13 రోజులకే నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. నాకు సినిమా ఛాన్సులు వస్తే చేయకూడదని కండీషన్‌ పెట్టాడు. మా ఇంటి నుంచి డబ్బు తీసుకురమ్మని హింసించేవాడు. అలా చాలా ఆస్తి తనకు ఇచ్చేశాను. అతడి వేధింపులు భరించలేక 2013లోనే విడాకులకు దరఖాస్తు చేశాను. మాకు ఓ పాప ఉంది. కోర్టు నిర్ణయం ప్రకారం ప్రతివారం పాపను చూపించాలన్నారు. అలా నా కూతురు వారంలో ఒకరోజు తనతో ఉండేది.

చనిపోయినప్పుడు తనను పట్టుకుని ఏడ్చా
నా మనసు ఎప్పుడు విరిగిపోయిందంటే.. నా స్థానంలో ఇంకొకరిని తీసుకు వచ్చినప్పుడు! పెళ్లి కాకముందే తనకు మరో అమ్మాయితో ఎఫైర్‌ ఉంది. ఈ విషయం తెలిశాక తన ముఖం కూడా చూడాలనుకోలేదు. కానీ చనిపోయినప్పుడు తనను పట్టుకుని ఏడ్చాను. ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావని గుండెలవిసేలా ఏడ్చాను. ఇప్పటికీ కొన్ని కేసులు కోర్టులోనే ఉన్నాయి. నా కూతురి కోసం ఇప్పుడిప్పుడే నా కెరీర్‌ను తిరిగి ప్రారంభిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది వనితా రెడ్డి.

చదవండి: అమర్‌ చాలా మంచివాడు.. దయచేసి అలా మాట్లాడొద్దంటూ నటుడి తల్లి భావోద్వేగం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement