కోలీవుడ్‌లో యంగ్ హీరోయిన్స్ శృతి పెరియస్వామి, నిరంజన నతియార్ జంటగా నటించిన చిత్రం 'వాజ్‌వు తొడంగుమిడం నీతానే'. అయితే ఈ చిత్రంలో వీరిద్దరు లెస్బియన్లుగా నటించారు. ఈ మూవీలో ముస్లిం, హిందూ యువతులుగా నటించారు. షార్ట్‌ఫ్లిక్స్ అనే ఓటీటీ సంస్థతో కలిసి నటి నీలిమా ఇసై దీన్ని నిర్మించారు. ఈ మూవీకి జయరాజ్ పళని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రస్తుతం షార్ట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజై ఓటీటీలో దూసుకెళ్తోంది.
(ఇది చదవండి: లూసిఫర్ సీక్వెల్ రెడీ.. మాలీవుడ్‌లో లైకా ప్రొడక్షన్స్ ప్లాన్)
ఈ మూవీకి సక్సెస్ కావడంతో చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈవెంట్‌కు హాజరైన పలువురు ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో లెస్బియన్లుగా నటించడం పట్ల శృతి పెరియస్వామి, నిరంజన నైదియర్ తమ అనుభవాలను వెల్లడించారు.
శృతి పెరియస్వామి మాట్లాడుతూ..' ఈ సినిమా కథను డైరెక్టర్ చెప్పిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నేను మోడలింగ్‌లో అనేక మంది టాలెంట్ చూపించేందుకు కష్టపడుతున్నారు. ఈ రంగంలో ఉండే చాలా మంది లెస్బియన్స్‌గానే జీవిస్తున్నారు. అందుకే ఈ పాత్రలలో నటించాలని నిర్ణయించుకున్నా' అని అన్నారు.
(ఇది చదవండి: వాడుకోవడం అలవాటేగా.. గీతూ ప్రశ్నలకు బిక్కముఖం వేసిన రతిక)
నిరంజన నైదియర్ మాట్లాడుతూ... ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాన్నే స్టోరీగా చేశాం. ఒక నటిగా దర్శకుడు చెప్పిందే చేస్తా. నన్ను లెస్బియన్ మద్దతుదారులా? అని చాలామంది ప్రశ్నించారు. ఒక చిత్రంలో నటుడు హంతకుడిగా నటిస్తే అతన్ని హత్యలు చేసే వ్యక్తిగా చిత్రీకరిస్తామా? ఈ చిత్రంలో కేవలం ఒక సమస్యను మాత్రమే దర్శకుడు చూపించారు' అని అన్నారు. కాగా.. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి షార్ట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో అర్షత్ ఫెరాస్, ఆరుముగవేల్, ఆర్జే ప్రదీప్, శంకర్, నిరంజన్, తస్మిక, కన్నన్, మారన్ కార్తికేయన్, మహేష్, శివ శక్తి, సుధ కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment