
శివకార్తికేయన్, అదితిశంకర్ జంటగా నటించిన చిత్రం మావీరన్( మహావీరుడు). నటి సరిత, దర్శకుడు మిష్కిన్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. గత 14న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ దర్శకుడు మడోన్ అశ్విన్ రైటింగ్, కన్వెన్షన్, క్లారిటి ఈ చిత్ర విజయానికి ముఖ్యకారణం అని నిర్మాత పేర్కొన్నారు. చిత్ర బాధ్యతంతా తన భుజాలపైనే మోశారు. తాను ఇంతకుముందు ప్రిన్స్ చిత్రానికి తాను సహ నిర్మాతగా వ్యవహరించానని, ఆమె చిత్రం సరిగ్గా ఆడలేదంది. దీంతో శివకార్తికేయన్ ఆ నష్టాన్ని భర్తీ చేశారన్నారు. ఆ తరువాత ఆయన్ని కలవడానికి తనకు ముఖం చెల్లలేదన్నారు.
అలాంటి సమయంలో శివకార్తికేయనే ఫోన్ చేసి మావీరన్ చిత్రం చేద్దామని చెప్పి అన్నీ తానై ఈ చిత్రాన్ని చేశారన్నారు. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పడానికి అంగీకరించిన విజయ్‌సేతుపతికి, అదేవిధంగా తెలుగు వెర్షన్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చిన రవితేజకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానన్నారు. చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని, గురువారంతో బ్రేక్ ఈవెంట్ అవుతుందన్నారు. ఇకపై వచ్చేదంతా లాభమేనని నిర్మాత చెప్పారు.
శివకార్తికేయన్ మాట్లాడుతూ మావీరన్ విజయం తనకు చాలా ప్రత్యేకం అన్నారు. తనకు మంచి యాక్టర్ అనిపించుకోవడం కంటే ఎంటర్‌టైనర్ అనిపించుకోవాలని కోరుకుంటానని, అది ఈ చిత్రంతో నెరవేరిందని అన్నారు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మళ్లీ నటించడానికి తాను సిద్ధం అని చెప్పారు. జయాపజయాలు మామూలే అని అయితే అభిమానుల సంతోషం కోసం ప్రేమిస్తూనే ఉంటానని శివకార్తికేయన్ పేర్కొన్నారు.
#MaaveeranThanksMeet happening now…😇💪🏼 #VeerameJeyam #Maaveeran #MaaveeranBlockBuster pic.twitter.com/5cYwLjs56c
— Shanthi Talkies (@ShanthiTalkies) July 20, 2023