Mahaveerudu Movie
-
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 25 సినిమాలు!
బాక్సాఫీస్ దగ్గర హడావుడి మాములుగా లేదు. ఎందుకంటే రజినీకాంత్ 'జైలర్' vs చిరంజీవి 'భోళా శంకర్' అన్నట్లు పరిస్థితి ఉంది. బుకింగ్స్, కలెక్షన్స్ విషయంలో ఈ రెండు పోటీ పడేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ఓటీటీ లవర్స్ కోసం కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. కొన్ని ఆల్రెడీ గురువారం స్ట్రీమింగ్‌లోకి వచ్చేయగా మరికొన్ని శుక్రవారం రిలీజ్ కానున్నాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ కానున్నాయనేది లిస్ట్ చూసేయండి. (ఇదీ చదవండి: రజినీకాంత్ 'జైలర్' ట్విటర్ రివ్యూ) శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ హార్ట్ ఆఫ్ స్టోన్ - తెలుగు డబ్బింగ్ మూవీ పద్మిని - మలయాళ చిత్రం పెండింగ్ ట్రైన్ - జపనీస్ సిరీస్ బిహైండ్ యువర్ టచ్ - కొరియన్ సిరీస్ - ఆగస్టు 12 మెక్ క్యాడెట్స్ - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది) పెయిన్ కిల్లర్ - ఇంగ్లీష్ సిరీస్(ఆల్రెడీ స్ట్రీమింగ్) జగున్ జగున్ - ఇంగ్లీష్ చిత్రం (స్ట్రీమింగ్) మ్యారీ మై డెడ్ బాడీ - ఇంగ్లీష్ మూవీ (స్ట్రీమింగ్ అవుతోంది) అమెజాన్ ప్రైమ్ రెడ్, వైట్ & రాయల్ బ్లూ - ఇంగ్లీష్ సినిమా మహావీరుడు - తెలుగు డబ్బిగ్ మూవీ మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2 - తెలుగు సిరీస్( స్ట్రీమింగ్ అవుతోంది) సత్యప్రేమ్ కీ కథ - హిందీ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) హాట్‌స్టార్ కమాండో - హిందీ సిరీస్ జియో సినిమా జరా హట్కే జరా బచ్కే - హిందీ సినిమా ఆహా వాన్ మూండ్రు - తమిళ మూవీ హిడింబ - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) వేరే మారి ఆఫీస్ - తమిళ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) జీ5 అభర్ ప్రళయ్ - బెంగాలీ సిరీస్ ద కశ్మీరీ ఫైల్స్ అన్ రిపోర్టెడ్ - తెలుగు డబ్బింగ్ సిరీస్ సోనీ లివ్ పోర్ తొడిల్ - తెలుగు డబ్బింగ్ సినిమా ద ఫేబుల్మన్స్ - ఇంగ్లీష్ మూవీ బ్రోకర్ - కొరియన్ చిత్రం పారాసైట్ - ఇంగ్లీష్ సినిమా లయన్స్ గేట్ ప్లే హై హీట్ - ఇంగ్లీష్ సినిమా బుక్ మై షో రుబీ గిల్మన్, టీనేజ్ క్రాకన్ - ఇంగ్లీష్ మూవీ (ఇదీ చదవండి: కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?) -
నెలలోపే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా
మరో స్టార్ హీరో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో విడుదలైన నెలలోపే.. స్మాల్ స్క్రీన్ పై సందడికి టైమ్ ఫిక్స్ చేసుకుంది. దీంతో మూవీ లవర్స్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. వచ్చిన వెంటనే చూసేయాల్సిందేనని ఫిక్సయిపోతున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఎప్పుడు ఏ ఓటీటీలో రానుందనే ఇప్పుడు చూసేద్దాం. టాక్ ఓకే కానీ శివకార్తికేయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగానే తెలుసు. పలు డబ్బింగ్ సినిమాలతో మనల్ని అలరిస్తున్న ఇతడు.. గతంలో 'జాతిరత్నాలు' అనుదీప్ తో కలిసి 'ప్రిన్స్' చేశాడు. అది సక్సెస్ కాలేదు. దీంతో తమిళంలో మాత్రమే నటిస్తున్నాడు. అలా జూలై 14న 'మావీరన్' (తెలుగు 'మహావీరుడు')గా థియేటర్లలోకి వచ్చాడు. కలెక్షన్స్ బాగానే వచ్చినప్పటికీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) ఓటీటీ తేదీ ఈ సినిమాలో శివకార్తికేయన్ తోపాటు అదితి శంకర్, యోగిబాబు, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 11 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ వారం 23 కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో క్రేజీ మూవీ వచ్చి చేరింది. కథేంటి? సత్య(శివకార్తికేయన్) ఓ కార్టూనిస్ట్. మహావీరుడు పేరుతో కామిక్ స్టోరీస్ రాస్తుంటాడు. నిజ జీవితంలో భయస్తుడు. ఓ సందర్భంలో ఉంటున్న అపార్ట్మెంట్ పైనుంచి దూకి చనిపోవాలనకుంటాడు. దెబ్బలు తగిలి ప్రాణాలతో బయటపడతాడు. అప్పటినుంచి అతడికి ఓ అజ్ఞాత గొంతు వినిపిస్తూ ఉంటుంది. దీంతో సత్య జీవితంలో ఏం జరిగింది? ఈ స్టోరీలో జర్నలిస్ట్ చంద్ర(అదితి శంకర్), మంత్రి ఎమ్ఎమ్ సూర్య(మిస్కిన్) ఎవరు? చివరకు ఏమైందనేదే స్టోరీ. OFFICIAL: #Maaveeran To Stream from Aug 11 on Prime..⭐#Sivakarthikeyan | #AditiShankar | #MadonneAshwin pic.twitter.com/DY9ErvJ8t1 — Laxmi Kanth (@iammoviebuff007) August 7, 2023 (ఇదీ చదవండి: కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!) -
అతనికి మొహం చూపించలేకపోయా.. రవితేజకు స్పెషల్ థ్యాంక్స్: నిర్మాత
శివకార్తికేయన్, అదితిశంకర్ జంటగా నటించిన చిత్రం మావీరన్( మహావీరుడు). నటి సరిత, దర్శకుడు మిష్కిన్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. గత 14న విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ గురువారం ఉదయం చైన్నెలోని సత్యం థియేటర్లో థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత అరుణ్ విశ్వ మాట్లాడుతూ దర్శకుడు మడోన్ అశ్విన్ రైటింగ్, కన్వెన్షన్, క్లారిటి ఈ చిత్ర విజయానికి ముఖ్యకారణం అని నిర్మాత పేర్కొన్నారు. చిత్ర బాధ్యతంతా తన భుజాలపైనే మోశారు. తాను ఇంతకుముందు ప్రిన్స్ చిత్రానికి తాను సహ నిర్మాతగా వ్యవహరించానని, ఆమె చిత్రం సరిగ్గా ఆడలేదంది. దీంతో శివకార్తికేయన్ ఆ నష్టాన్ని భర్తీ చేశారన్నారు. ఆ తరువాత ఆయన్ని కలవడానికి తనకు ముఖం చెల్లలేదన్నారు. అలాంటి సమయంలో శివకార్తికేయనే ఫోన్ చేసి మావీరన్ చిత్రం చేద్దామని చెప్పి అన్నీ తానై ఈ చిత్రాన్ని చేశారన్నారు. ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ చెప్పడానికి అంగీకరించిన విజయ్‌సేతుపతికి, అదేవిధంగా తెలుగు వెర్షన్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చిన రవితేజకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానన్నారు. చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని, గురువారంతో బ్రేక్ ఈవెంట్ అవుతుందన్నారు. ఇకపై వచ్చేదంతా లాభమేనని నిర్మాత చెప్పారు. శివకార్తికేయన్ మాట్లాడుతూ మావీరన్ విజయం తనకు చాలా ప్రత్యేకం అన్నారు. తనకు మంచి యాక్టర్ అనిపించుకోవడం కంటే ఎంటర్టైనర్ అనిపించుకోవాలని కోరుకుంటానని, అది ఈ చిత్రంతో నెరవేరిందని అన్నారు. మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మళ్లీ నటించడానికి తాను సిద్ధం అని చెప్పారు. జయాపజయాలు మామూలే అని అయితే అభిమానుల సంతోషం కోసం ప్రేమిస్తూనే ఉంటానని శివకార్తికేయన్ పేర్కొన్నారు. #MaaveeranThanksMeet happening now…😇💪🏼 #VeerameJeyam #Maaveeran #MaaveeranBlockBuster pic.twitter.com/5cYwLjs56c — Shanthi Talkies (@ShanthiTalkies) July 20, 2023 -
‘మహావీరుడు’ మూవీ రివ్యూ
టైటిల్: మహావీరుడు నటీనటులు: శివకార్తికేయన్, అదితి శంకర్, మిస్కిన్, సరిత, సునీల్, యోగిబాబు నిర్మాత:అరుణ్ విశ్వ దర్శకత్వం:మడోన్ అశ్విన్ సంగీతం: భరత్ శంకర్ సినిమాటోగ్రఫీ: విషు అయ్యన్న విడుదల తేది: జులై 14, 2023 మహావీరుడు కథేంటంటే.. సత్య(శివకార్తికేయన్) ఓ కార్టూనిస్ట్. మహావీరుడు పేరుతో కామిక్ కథలు రాస్తుంటాడు. నిజ జీవితంలో భయస్తుడు. కానీ తన కథలు మాత్రం సమాజం కోసం పోరాడే ఓ మహావీరుడి గురించే ఉంటాయి. తను ఉండే స్లమ్ ఏరియా నుంచి అందరిని వేరే ప్రాంతానికి తరలిస్తుంది ప్రభుత్వం. ఆ ఏరియా ప్రజలందరికి ఓ అపార్ట్మెంట్కి తరలిస్తారు. మంత్రి ఎమ్ ఎమ్ సూర్య(మిస్కిన్) మనుషులు నాసిరకం సిమెంట్‌తో ఆ అపార్ట్‌మెంట్‌ని నిర్మిస్తారు. పైకి అందంగా, అద్భుతంగా కనిపించినప్పటికీ.. ఇంట్లోకి వెళ్లిన తొలిరోజు నుంచి కిటికీలు పడిపోవడం, గోడలకు పగుళ్లు రావడం జరుగుతుంటాయి. ఇదేంటని ప్రశ్నిస్తే మంత్రి మనుషులు బెదిరిస్తారు. తన తల్లిని, సోదరిని అవమానించినా..సత్య ఎదురు తిరగడు. అయితే ఓ సందర్భంలో చనిపోవాలని అపార్ట్మెంట్ పైకి దూకేందుకు ప్రయత్నిస్తాడు సత్య. దెబ్బలు తగిలినా ప్రాణాలతో భయటపడతాడు. (చదవండి: ‘బేబీ’ మూవీ రివ్యూ) అప్పటి నుంచి అతనికి మాత్రమే ఓ అజ్ఞాత వ్యక్తి వాయిస్ వినిస్తుంది(హీరో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు). అతను సత్యని ఓ మహావీరుడిగా, మంత్రి సూర్యని యముడిగా వర్ణిస్తుంటాడు. అంతేకాదు మంత్రి నాసిరకంగా కట్టించిన ప్రజా భవనం కూలిపోతుందనే విషయాన్ని ఆ గొంతు అతనికి తెలియజేస్తుంది. అప్పుడు సత్య ఏం చేశాడు? ఆ అజ్ఞాత గొంతు కారణంగా సత్య జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అతని ప్రయాణంలో జర్నలిస్ట్ చంద్ర(అదితి శంకర్) పాత్ర ఏంటి? చివరకు మంత్రిని ఎదురించి ప్రజల ప్రాణాలకు ఎలా కాపాడాడు? అనేదే ‘మహావీరుడు’ కథ. ఎలా ఉందంటే.. ఓ రాజకీయ నాయకుడు ప్రజలను మోసం చేయడం.. హీరో వారికి అండగా నిలిచి, ఆ రాజకీయ నాయకుడి అవినీతిని భయటపెట్టడం, ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడడం.. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. మహావీరుడు కథ కూడా ఇదే. కానీ ఇక్కడ హీరో భయస్తుడు. ఓ పిరికివాడు ప్రజల కోసం ఎలా ధైర్యవంతుడిగా మారడనేదే ఈ మూవీ కథ. అయితే ఇదంతా సీరియస్ కాకుండా.. సెటిల్డ్ కామెడీతో ఎంటర్టైన్గా సాగుతుంది. రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకు చాలా ప్లస్ అయింది. అలాగే యోగిబాబు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. హీరో క్యారెక్టర్, వాయిస్ ఓవర్.. కొన్ని చోట్ల మర్యాద రామన్న సినిమాను గుర్తు చేస్తుంది. అలాగే హీరో భయస్తుడు అని చెప్పించడానికి వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరోకి అజ్ఞాత గొంతు వినిపించేంత వరకు కథంతా సోసోగా సాగుతుంది. ఆ తర్వాత సినిమా మొత్తం కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే సెకండాఫ్ మాత్రం కథ సాగదీతగా అనిపిస్తుంది. హీరో విలన్ దగ్గరకి వెళ్లి లొంగిపోయిన తర్వాత వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అలాగే హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేవు. సినిమా నిడివి కూడా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది. సింపుల్‌గా చెప్పాల్సిన విషయాలను కూడా డీటైల్డ్‌గా చూపించి నిడివి పెంచేశారు. అలాగే నాసిరకంగా కట్టించిన బిల్డింగుల కారణంగా ప్రజలు పడే ఇబ్బందులను కూడా బలంగా చూపించలేకపోయారు. వాటిని మరింత ఎమోషనల్‌గా తీర్చిదిద్దింటే బాగుండేది. ఫస్టాఫ్ మాదిరే సెకండాఫ్ కామెడీ కూడా వర్కౌట్ అయితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఈ మహావీరుడు కాస్త నవ్విస్తాడు. ఎవరెలా చేశారంటే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సత్య పాత్రలో శివకార్తికేయన్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రలు చేయడం అతనికి కొత్తేమి కాదు. భయస్తుడిగా ఆయన చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. జర్నలిస్ట్ చంద్రగా అదితి శంకర్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఈ చిత్రంలో ఆమె నిడివి చాలా తక్కువనే చెప్పాలి. భవన కార్మికుడిగా యోగిబాబు చేసే కామెడీ సినిమాకు చాలా ప్లస్ అయింది. మంత్రిగా మిస్కిన్ , అతని సహాయకుడిగా సునీల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. భరత్ శంకర్ సంగీతం జస్ట్ ఓకే. పాటలకు తెలుగు ప్రేక్షకులను నచ్చవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ పనితీరు బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి.