ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతున్న క్రీడాకారులు
-
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
-
స్వర్గీయ ధ్యాన్‌చంద్‌కు నివాళి
-
స్ఫూర్తి ప్రదాత: డీఎస్డీఓ కబీర్‌దాస్
ఖమ్మం స్పోర్ట్స్: హాకీ మాంత్రికుడు స్వర్గీయ ధ్యాన్‌చంద్ జయంతి ఉత్సవాలను ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా జరిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. అథ్లెటిక్స్, వాలీబాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్ తదితర క్రీడాంశాల్లో ఈ పోటీలు జరిగాయి. దాదాపు ఐదు ఒలింపిక్స్ క్రీడల్లో తనకు సాటి మరెవరూ లేరని ధ్యాన్‌చంద్ నిరూపించారని డీఎస్డీఓ కబీర్‌దాస్ పేర్కొన్నారు. హాకీ క్రీడకు ఎనలేని ప్రాధాన్యం తీసుకొచ్చిన క్రీడాకారుడిగా ధ్యాన్‌చంద్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక క్రీడాకారుడికి స్ఫూర్తి ప్రదాన అన్నారు. ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు ఎండీ గౌస్, ఎండీ గౌస్‌పాషా, ఎండీ అక్బర్‌అలీ, పీడీలు గంగాప్రసాద్, ఎల్లారెడ్డి, షఫీ, అహ్మద్, ఆదర్శకుమార్, భాగ్యలక్ష్మి, గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు.