కారు పల్టీ.. తల్లి, కుమార్తె దుర్మరణం
విజయవాడకు చెందిన రెండు కుటుంబాల సభ్యులు కంచికచర్ల వెళ్లి శుభకార్యంలో పాల్గొని కారులో తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఓ మహిళ, ఆమె ఆరు నెలల కుమార్తె మరణించగా, మరో ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేతనకొండ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్/ విజయవాడ, న్యూస్‌లైన్ : వరుసకు బావ, బావమరిది అయిన ఇద్దరు కుటుంబసభ్యులతో కలిసి శుభకార్యం లో పాల్గొనేందుకు కారులో బంధువుల ఇంటి కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, ఆమె ఆరునెలల కు మార్తె మరణించారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.
ఇబ్రహీపట్నం కేతనకొండ వద్ద గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరి గింది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ పూర్ణానందంపేటకు చెందిన కె.చంద్రశేఖర్, ఎస్.శ్రీనివాస్ వరుసకు బావ, బావమరిది. బంధువుల ఇంట్లో శుభకార్యంలో పాల్గొనేందుకు రెండు కుటుంబాలకు చెందిన 10 మంది కారులో కంచికచర్ల వెళ్లారు. వీరిలో న లుగురు పెద్దవారు, ఆరుగురు పిల్లలు ఉన్నా రు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత రెండు గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు.
ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ వద్దకు వచ్చేసరికి కారు నడుపుతున్న ఎస్.శ్రీనివాస్ నిద్రావస్థకు చేరుకున్నాడు. దీం తో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు మూడు పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఎస్.కృష్ణవేణి(26) అక్కడికక్కడే మరణిం చింది. ఈ ప్రమాదంలో కృష్ణవేణి కుమార్తె సాయి శిరీష(ఆరునెలలు), కె.బుజ్జమ్మ(50), ఎస్.శ్రీనివాస్(34), కె.చంద్రశేఖర్(30) కె.యశ్వంత్(10), కె.జాగృతి(6), కార్తీక్(12), సాయి(10), ఎస్.తేజ(5)కు గాయాలయ్యా యి. వీరిని అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
చిన్నారి సాయి శిరీష అక్కడ చికిత్స పొందు తూ కొద్దిసేపటికి మరణించింది. గాయపడినవారిలో బుజ్జమ్మ పరి స్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రంగా గాయపడిన చిన్నారులు షాక్ కు గురై మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కృష్ణవేణి మృతదేహాన్ని ఘటనాస్థలి నుంచి ఇబ్రహీంపట్నం పోలీసులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం గురించి తెలిసిన బాధితుల బంధువులు ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నవారిని చూసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సాయి శిరీష మృతదేహాన్ని చూసి వారు విలపిస్తుండటం అక్కడ ఉన్నవారిని కలచివేసింది. గాయపడిన వారినుంచి అవుట్‌పోస్టు పోలీసులు వివరాలు సేకరించి, ఇబ్రహీంపట్నం పోలీసులకు పంపించారు.