
సాక్షి, విజయవాడ : నగరంలో ఆగి ఉన్న ఓ కారులో మృతదేహం వెలుగుచూసింది. డీవీ మ్యానర్ హెటల్ పక్కసందులో ఏపీ 16 ఎఫ్ఎఫ్ 9999 బ్లాక్ ఎండీవర్ కారులో గురువారం ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతుడ్ని తాడిగడపకు చెందిన కరణం రాహుల్‌గా గుర్తించారు. అతడికి జి. కొండూరులో గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నట్లు సమాచారం. వ్యాపారాల్లో విబేధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆత్మహత్యా లేక హత్యా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కుటుంబసభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, రాహుల్ మిస్సింగ్‌పై రాత్రి పీఎస్‌లో ఫిర్యాదు చేసినట్లు: ఏసీపీ ఖాదర్ బాషా తెలిపారు. కారులో మృతదేహం ఉన్నట్లు ఈ ఉదయం సమాచారం వచ్చిందని, మృతుడిని తాడిగడపకు చెందిన కరణం రాహుల్‌గా గుర్తించామని ఏసీపీ అన్నారు. ఘటనాస్థలంలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.